సబ్‌ కలెక్టర్‌ సాయికాంత్‌ వర్మ బదిలీ 

0
195
రాజమహేంద్రవరం,జూన్‌ 22 : రాజమహేంద్రవరం సబ్‌ కలెక్టర్‌ సీఎం సాయికాంత్‌ వర్మ బదిలీ అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా భారీగా ఐఏఎస్‌ అధికారుల బదిలీల్లో భాగంగా సబ్‌ కలెక్టర్‌ బదిలీ అయ్యారు.ఆయన స్ధానంలో ఇంకా ఎవరినీ నియమించలేదు. కాగా సాయికాంత్‌ వర్మను శ్రీకాకుళం జిల్లా సీతంపేట ఐటీడీఏ పీఓగా బదిలీ చేశారు. అలాగే తూర్పు గోదావరి జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ డా. ఏ మల్లికార్జునను ఆరోగ్య శ్రీ సీఈఓగా బదిలీ చేశారు.  జిల్లా జాయింట్‌ కలెక్టర్‌గా పార్వతీపురం ఐటీడీఏ పీఓ లక్ష్మీషా నియమితులయ్యారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here