సమస్యలపై నినదించిన విద్యార్థి లోకం

0
98
సబ్‌ కలెక్టరేట్‌ వద్ద ఎస్‌ఎఫ్‌ఐ ధర్నా
రాజమహేంద్రవరం, ఆగస్టు 22 :  విద్యార్థులకు సకాలంలో ప్రభుత్వం నుండి అందవలసిన కనీస మౌళిక సౌకర్యాల కల్పనకు అవసరమైన నిధులు, స్కాలర్‌షిప్స్‌, ఫీీజు రీయంబర్స్‌మెంట్స్‌ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ మాజీ జిల్లా కార్యదర్శి బి.రాజులోవ డిమాండ్‌ చేశారు. ఫీజు రీయంబర్స్‌మెంటు బకాయిలు, స్కాలర్‌షిప్స్‌ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ భారత విద్యార్థి ఫెడరేషన్‌(ఎస్‌ఎఫ్‌ఐ) ఇచ్చిన పిలుపులో భాగంగా ఈరోజు రాజమహేంద్రవరం సబ్‌ కలెక్టర్‌ కార్యాలయానికి పెద్దఎత్తున వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థినీ, విద్యార్థులు చేరుకుని ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా మాజీ కార్యదర్శి రాజులోవ, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి బి.పవన్‌, సిటీ కార్యదర్శి రాజా మాట్లాడారు. విద్యార్థుల చదువుకుల అవసరమైన కనీస సదుపాయాలను కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యిందని పేర్కొన్నారు. సంక్షేమ వసతి గృహాల్లో చదివేటువంటి ఎస్‌.సి, ఎస్‌.టి, బి.సి హాస్టల్‌ విద్యార్థులకు భవనాలు, పెండింగ్‌ మెస్‌, కాస్మోటిక్‌ ఛార్జీలు సమస్య తీవ్రంగా ఉందన్నారు. దీనితో పాటు అనేక ఇతర సమస్యలు విద్యార్థుల చదువులకు ఆటంకం కల్గిస్తున్నాయన్నారు.  యూనివర్శిటీ హాస్టళ్లకు రూ. 2500 మెస్‌బిల్లును పెంచాలని, నన్నయ యూనిర్శిటీ అనుబంధ డిగ్రీ కళాశాల విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని, కళాశాల సమయంలో అన్ని రూట్స్లో స్టూడెంట్స్‌ స్పెషల్‌ బస్లు వేయాలని, రాజమహేంద్రవరం నగరంలో ప్రభుత్వ మహిళా జూనియర్‌ కళాశాల ఏర్పాటు చేయాలని, కందుకూరి విద్యాసంస్థలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని పూర్తి స్థాయి ప్రభుత్వ విద్యాసంస్థలుగా నడపాలని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు రాజేష్‌, సతీష్‌, ప్రసన్న, విశాలక్ష్మి, వినయ్‌, సుభాష్‌, తేజ, జాన్‌ పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here