సమస్యలు వింటాం….పరిష్కరిస్తాం

0
65
పధకాలను చేరువ చేసేందుకే డివిజన్ల పర్యటన : శ్రీఘాకోళ్ళపు
1వ డివిజన్‌ అధ్యక్షునిగా ముప్పన ప్రభాకర్‌
రాజమహేంద్రవరం, డిసెంబర్‌ 9 : ప్రతి ఇంటికి వెళ్ళి సమస్యలను అడిగి వాటిని పరిష్కరించడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెడుతున్న పధకాలను అర్హులైన వారికి చేరువ చేయడానికే డివిజన్ల పర్యటన ప్రారంభించామని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ సిటి కో ఆర్డినేటర్‌ శ్రీఘాకోళ్ళపు శివరామ సుబ్రహ్మణ్యం అన్నారు. సిటి కో ఆర్డినేటర్‌గా బాధ్యతలు స్వీకరించిన శ్రీఘాకోళ్ళపు శివరామ సుబ్రహ్మణ్యం నేటి నుంచి డివిజన్ల వారి పర్యటనకు శ్రీకారం చుట్టారు.అందులో భాగంగా 1వ డివిజన్‌ ఇన్చార్జ్‌ ముప్పన ప్రభాకర్‌ ఆధ్వర్యంలో పర్యటన కార్యక్రమం నిర్వహించారు. ముందుగా లాలాచెరువు జంక్షన్‌లో ఉన్న వైఎస్‌ రాజశేఖరరెడ్డి, డా. బిఆర్‌ అంబేద్కర్‌ విగ్రహాలకు పార్టీ సిటి కో ఆర్డినేటర్‌ శివరామ సుబ్రహ్మణ్యం,మాజీ ఎమ్మెల్యేలు రౌతు సూర్యప్రకాశరావు, ఆకుల సత్యనారాయణ, జాంపేట బ్యాంకు చైర్మన్‌ బొమ్మన రాజ్‌ కుమార్‌, సిటి అధ్యక్షుడు నందెపు శ్రీనివాస్‌, జిల్లా అధికార ప్రతినిధి మేడపాటి షర్మిలారెడ్డి, పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో శివరామ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ పధకాలను ఎలా ప్రజల్లోకి తీసుకెళ్ళి,ప్రతిపక్షాల కుట్రలను ఎలా త్రిప్పికొట్టాలన్న దానిపై డివిజన్ల వారీగా పర్యటనలు ప్రారంభించామన్నారు. స్థానికంగా ఉన్న సమస్యలను పరిష్కరించి,అభివృద్ధి కుంటుపడకుండా చూడాలన్నదే తమ లక్ష్యమన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పధకాలను చేరువ చేయడమే తమ ముఖ్య ఉద్దేశమని, దీంతో పాటు డివిజన్ల వారీగా పార్టీని పటిష్టపరిచాలని అన్నారు. అందుకోసం అన్ని అడ్డంకులను అధిగమించాలని సూచించారు. గత ఐదు నెలల్లో ఊహించలేని పధకాలను అమలు చేశారని, వాటిని చేరువ చేసేందుకు వాలంటీర్ల వ్యవస్థను సిఎం జగన్‌ ప్రవేశపెట్టారని అన్నారు. గత ఎన్నికలలో తెలుగుదేశం వారు రాజమహేంద్రవరంలో కులం, ధనం,అహకారంతో గెలిచారని, వారు చెప్పినట్టు నడచే పరిస్థితి ఇక్కడ లేదన్నారు. గత ప్రభుత్వంలో జన్మభూమి కమిటీల పేరుతో దోచుకున్నారని, ఇప్పుడు అలాంటి పరిస్థితి కాదని, పారదర్శకంగా పధకాలు అమలు చేస్తున్నారని అన్నారు. రాబోయే ఎన్నికలలో ఎవరు పోటీ చేయాలన్న అంశాన్ని పక్కన పెట్టి డివిజన్‌లో పార్టీని బలోపేతం చేయాలని సూచించారు. గతంలో ఎమ్మెల్యేలుగా పనిచేసిన రౌతు సూర్యప్రకాశరావు, ఆకుల సత్యనారాయణ వంటి నాయకుల సహకారంతో అభివృద్ధి సాధిస్తామన్నారు. రౌతు సూర్యప్రకాశరావు మాట్లాడుతూ పదేళ్ళ ఎమ్మెల్యేగా పనిచేసిన తాను వైఎస్‌ రాజశేఖరరెడ్డి సహకారంతో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని అన్నారు. ఇళ్ళు,ఫించన్లు, బ్రిడ్జిలు,ఇలా ఎన్నో పనులు చేసి ప్రజలకు చేరువయిన తాను గత ఎన్నికలలో ఓటమికి కారణాలు తెలుసుకుని పార్టీకి ద్రోహం చేసిన వారిని గమనించాలని కోరారు. సమాజంలో మార్పు కోసం జగన్‌ ఎన్నో సంస్కరణలు ప్రవేశపెడుతున్నారని, నేరాలకు మూలమైన మద్యం అమ్మకాలను దశలవారీగా తగ్గిస్తున్నారని అన్నారు. తెలుగుదేశం హయాంలో అవినీతి ఏ స్థాయికి చేరిందో అందరికి తెలుసని, జగన్‌ అధికారంలోకి వచ్చిన నాటి నుండి నేటి వరకు అవినీతి రహిత పాలన అందిస్తున్నారని అన్నారు.రాబోయే ఎన్నికలు ఏవైనా విజయం వైఎస్సార్‌ పార్టీదే అవ్వాలని సూచించారు.  ఆకుల సత్యనారాయణ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పధకాల ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలియాలంటే వాటిని అర్హులకు చేర్చాలని,అందుకే గ్రామ సచివాలయం వ్యవస్థను తీసుకొచ్చారని అన్నారు. పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేసి పార్టీని బలపరిచి, నగరపాలక సంస్థ ఎన్నికలలో జెండా ఎగురవేయాలని కోరారు. షర్మిలారెడ్డి మాట్లాడుతూ మాట తప్పకుండా,మడమ తిప్పకుండా ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్న జగన్‌ నాయకత్వాన్ని బలపరచాలని కోరారు.ముఖ్యమంత్రి సతీమణి భారతి జన్మదినోత్సవం సందర్భంగా కేక్‌ కట్‌ చేశారు. ఈ సందర్భంగా 1వ డివిజన్‌ అధ్యక్షులుగా ముప్పన ప్రభాకర్‌ ని నియమించారు. డివిజన్లో నెలకొన్న సమస్యలను పోలేపల్లి నాగేశ్వరరావు వివరించారు.ఈ కార్యక్రమంలో సిసిసి ఎండి పంతం కొండలరావు, నక్కా శ్రీనగేష్‌, ప్రసాదుల హరనాధ్‌, అజ్జరపు వాసు, నరవ గోపాలక ష్ణ, మజ్జి అప్పారావు,మార్తి లక్ష్మీ, పెదిరెడ్ల శ్రీనివాస్‌,పోలేపల్లి నాగేశ్వరరావు, ఇసుకపల్లి శ్రీనివాస్‌,సుంకర శ్రీనివాస్‌, ఉప్పాడ కోటరెడ్డి,మరుకుర్తి నరేష్‌ కుమార్‌, గుడాల జాన్సన్‌, పతివాడ రమేష్‌,కాటం రజనీకాంత్‌, ఎస్‌.అరుణ్‌, కరీంఖాన్‌, నీలపాల తమ్మారావు,సోమి శ్రీనివాసరావు, కుక్కా తాతబ్బాయి, తిరగాటి దుర్గ, బూసి వజ్రనాధ్‌, బురిడి త్రిమూర్తులు, ఉదయ్‌ రాణా,తంగుడు కోటి,సాలా సావిత్రి,రాయుడు గణేష్‌, పెంకె సురేష్‌,గుడాల ప్రసాద్‌, పాలూరి శ్రీనివాస్‌,రబ్బానీ,షేక్‌ మస్థాన్‌, డివిజన్‌ నాయకులు చెక్కా నవీన్‌ కుమార్‌, పట్ర సతీష్‌ కుమార్‌, బొట్టా రాజేష్‌, లోకేష్‌,ఎస్‌.కె.సుభానీ, శరత్‌,కడియాల నాని,పోలేపల్లి కన్నారావు,దొరబాబు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here