సమస్యల పరిష్కారమే లక్ష్యం : మేయర్‌ 

0
259
రాజమహేంద్రవరం, అక్టోబర్‌ 5 :తనపై నమ్మకంతో ఓటు వేసిన ప్రజల ఆలోచన మేరకు 39వ డివిజన్‌ను  నో వర్క్‌ డివిజన్‌ గా చెయ్యాలన్న సంకల్పంతో అనేక పనులను చేపట్టినట్లు మేయర్‌ పంతం రజనీ శేషసాయి పేర్కొన్నారు.  డివిజన్‌లోని వాంబే గ హ సముదాయం వద్ద గల కమ్యూనిటి హాల్‌ నందు స్థానికులతో సమస్యలపై చర్చించారు .ఏమైనా  సమస్యలుంటే గ్రామదర్శినిలో పాల్గొని అధికారుల ద ష్టికి తీసుకు వస్తే వాటిని పరిష్కరిస్తామని తెలిపారు. ఈ నెలలో ఎ .బి .నాగేశ్వరరావు పార్క్‌ ,అంబేద్కర్‌ కమ్యూనిటి హాల్‌పై నిర్మించిన అదనపు అంతస్తు ప్రారంభించే అవకాశం ఉందని తెలిపారు. నోడల్‌ అధికారి చింతలపాటి సత్యనారాయణ రాజు ,స్కూల్స్‌ సూపర్‌ వైజర్‌ పులుగుర్త దుర్గాప్రసాద్‌, జన్మభూమి కమిటీ సభ్యులు పాల్గొన్నారు. అదనపు కమిషనర్‌ ఎన్‌ .వి .వి .సత్యనారాయణరావు 43వ డివిజన్‌లో కార్పొరేటర్‌ కంటిపూడి వెంకట పద్మావతితో, డిప్యూటి కమిషనర్‌ టి .రాజగోపాల రావు 45 వ డివిజన్‌ నందు కార్పొరేటర్‌ తాడి మరియ,తదితరులతో డివిజన్‌ నందు పర్యటించి స్థానిక సమస్యలను గుర్తించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here