సమస్యల పరిష్కారానికి చర్యలు 

0
193
22 వ డివిజన్‌లో ఎమ్మెల్యే భవాని పర్యటన
రాజమహేంద్రవరం, ఆగస్టు 3 : నగరంలో నెలకొన్న ప్రతి సమస్యను తప్పకుండా పరిష్కరిస్తామని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని అన్నారు. స్థానిక 22 వ డివిజన్‌లో నెలకొన్న సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని స్థానిక ప్రజలు విన్నవించగా  ఎమ్మెల్యే భవాని ఈ ఉదయం ఆ డివిజన్‌ లో పర్యటించారు. స్థానిక ప్రజలు విన్నవించిన సమస్యలను పరిశీలించారు. నగరపాలక సంస్థ అధికారులతో మాట్లాడి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన మాట ప్రకారం ప్రజల వెంటే ఉంటూ వారి సమస్యలను పరిష్కరిస్తామన్నారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటామన్నారు. తెలుగుదేశం పార్టీ యువ నాయకులు ఆదిరెడ్డి శ్రీనివాస్‌ (వాసు) మాట్లాడుతూ ప్రజలకు ఎల్లవేళలా  తోడుగా ఉంటామని భరోసా ఇచ్చారు. ప్రస్తుతం వర్షాకాలం నేపథ్యంలో ప్రజలంతా పరిసరాలను శుభ్రంగా ఉంచుకుంటూ జాగ్రత్తలు పాటించాలని సూచించారు. స్థానిక టీడీపీ నాయకులు మాటూరి సిద్దు, శెట్టి జగదీష్‌, డివిజన్‌ కమిటీ సభ్యులు వారి వెంట ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here