సమస్యల పరిష్కారానికి ముందుటాం

0
94
46వ డివిజన్లలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి పర్యటన
రాజమహేంద్రవరం, నవంబర్‌ 7 : స్థానిక  46వ డివిజన్లో   సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ శ్రీనివాస్‌  ఈరోజు పర్యటించారు. డివిజన్లో పర్యటించి స్థానిక ప్రజలతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. డివిజన్‌లో డ్రైనేజీ వ్యవస్థ, నీటి సరఫరా, ప్రమాద కరంగా ఉన్న విద్యుత్‌ స్తంబాలు, వేలాడుతున్న విద్యుత్‌ తీగలను పరిశీలించి, సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలను సత్వరం పరిష్కరించాలని సూచించారు. అలాగే డివిజన్‌లో నిత్యం పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా చేయాలన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజా సమస్యలను పరిష్కరించే విషయంలో తామేప్పుడు ముందుంటామన్నారు. ఏ సమస్య ఉన్నా… ఏ సమయంలోనైనా తమకు చెప్పవచ్చన్నారు. తెలుగుదేశం పార్టీ యువ నాయకులు ఆదిరెడ్డి శ్రీనివాస్‌ (వాసు) మాట్లాడుతూ నిత్యం తాము ప్రజలకు అందుబాటులో ఉంటామన్నారు. నగరంలోని అన్ని డివిజన్లలో నెలకొన్న ప్రతి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. బొచ్చా శ్రీను, కేబుల్‌ రవి, మొకమాటి సత్యనారాయణ, తురకల నిర్మల, సందక లక్ష్మణరావు, కేబుల్‌ మురళి, గోవిందు, హరి, రాము తదితరులు వారి వెంట ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here