సమస్యల పరిష్కార వేదిక జన్మభూమి : ఎమ్మెల్సీ ఆదిరెడ్డి

0
361
రాజమహేంద్రవరం, జనవరి 4 :  ప్రజా సమస్యల పరిష్కారమే  జన్మభూమి కార్యక్రమ ముఖ్య ఉద్ధేశ్యమని శాసనమండలి సభ్యులు ఆదిరెడి ్డ అప్పారావు అన్నారు. స్ధానిక 30, 36,37,39 డివిజన్లలో జరిగిన  జన్మభూమి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రజల వద్దకు అధికారులను రప్పించి ప్రజా సమస్యల పరిష్కారానికి ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. మహిళల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను కోరారు. తెదేపా హయాంలో మహిళాభ్యున్నతికి, సంక్షేమానికి ఎన్నో చర్యలు చేపట్టారని ఆయన అన్నారు.