సమస్య పరిష్కారం…నేతకు సత్కారం

0
368

30 వ డివిజన్‌లో ట్రాన్స్‌ఫార్మర్‌ మార్పు – గన్నికి స్ధానికుల కృతజ్ఞతలు

రాజమహేంద్రవరం, మార్చి 21 : స్ధానిక 30 వ డివిజన్‌ మేదరపేటలో ఉన్న రామాలయం వద్ద స్ధానికులకు అసౌకర్యంగా ఉన్న విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ను వేరే చోటుకు మార్పించడానికి గుడా చైర్మన్‌ గన్ని కృష్ణ చొరవ చూపడంతో సమస్య పరిష్కారమైంది. దీనిపై స్ధానికులు ఆయనకు కృతజ్ఞతలు తెలియజేయడమే గాక ఆయనను సత్కరించారు. ఈ సమస్యపై వారు ఎన్నో పర్యాయాలు ఎందరికో మొరపెట్టుకున్నా ఫలితం లేకపోయింది. ఈ నేపథ్యంలో ఇటీవల శ్యామలాంబ అమ్మవారి ఉత్సవాల్లో పాల్గొనేందుకు అక్కడికి వెళ్ళిన గన్నికి వారు తమ సమస్యను మొరపెట్టుకున్నారు. దీనిపై స్పందించిన ఆయన వెంటనే అక్కడ నుంచే సంబంధిత ట్రాన్స్‌కో అధికారులతో మాట్లాడారు. స్ధానికుల, గన్ని విజ్ఞప్తి మేరకు ఆ ట్రాన్స్‌ఫార్మర్‌ను వేరే చోటకు వెంటనే మార్చడంతో స్ధానికుల హర్షం వ్యక్తం చేసి గన్నికి ధన్యవాదాలు తెలియజేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here