సమాచార కమిషనర్లను తక్షణం నియమించాలి

0
269

సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం వద్ద ధర్నా

రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 19 : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సమాచార కమిషన్‌ సభ్యులను వెంటనే నియమించాలని డిమాండ్‌ చేస్తూ సమాచార హక్కు ప్రచార ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఈరోజు సబ్‌కలెక్టర్‌ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. రాష్ట్రప్రభుత్వం సమాచార కమిషనర్లను నియమించడంలో నిర్లక్ష్యవైఖరి అవలంభిస్తోందని ఐక్యవేదిక అధ్యక్షుడు ఏడిద బాబి విమర్శించారు. ఇకనైనా ఈ చట్టాన్ని సమగ్రంగా అమలు చేసేందుకు అర్హత కలిగినవారిని కమిషనర్లుగా నియమించాలని , ఈ నియామకాలలో ఉద్యమకారులకు కూడా అవకాశం కల్పించాలని కోరారు. మహిళలను కూడా కమిషనర్లుగా నియమించాలని వారు కోరారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి పెంకే శ్రీనివాసరావు, కోశాధికారి నాళం వరప్రసాద్‌, మహిళా కమిటీ అధ్యక్షురాలు నిర్భయలక్ష్మి, ప్రధాన కార్యదర్శి ప్రియసౌజన్య, ఉపాధ్యక్షులు వానపల్లి ఆంజనేయులు, అల్లం రత్నాజీ, కార్యనిర్వాహక కార్యదర్శి కడియాల శ్యామ్‌కుమార్‌, కార్యదర్శులు సాయికుమార్‌, నాగేశ్వరరావు, జాని, సంయుక్త కార్యదర్శులు పి.వీర్రాజు, కొండ వెంకటస్వామి, చరణ్‌, చల్లా చినవెంకటేశ్వరరావు, ప్రచార కార్యదర్శి రాజ్‌కుమార్‌ పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here