సమాచార హక్కు చట్టానికి తూట్లు పొడుస్తున్నారు

0
333

రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 3 : ప్రజలకు ప్రశ్నించే హక్కు కల్పించిన సమాచార హక్కు చట్టంపై ప్రజలకు సమగ్ర అవగాహన కల్పించి, దీన్ని వినియోగించుకునేలా చేయడమే సమాచార హక్కు సంఘం ప్రధాన లక్ష్యమని సంఘం వ్యవస్థాపకులు గొల్లపల్లి మురళి చెప్పారు. సంఘం జిల్లా గౌరవ సలహాదారుగా టి శ్రీనివాస యాదవ్‌,జిల్లా కన్వీనర్‌ గా మాలె విజయలక్ష్మి,అధ్యక్షులుగా శిరిగిడి ప్రసాద్‌, కో ఆర్డినేటర్‌ గా శిరిగిడి బాల సరస్వతి,కార్యవర్గ సభ్యులుగా లెక్చరర్‌ కాటం రమాదేవి, నగర అధ్యక్షులుగా సిహెచ్‌ భాగ్యలక్ష్మి,కార్యదర్శిగా లక్ష్మి,కోశాధికారిగా తురకల నిర్మల తదితరులను నియమిస్తూ ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటుచేశారు. 2015లో వచ్చిన సమాచార హక్కు చట్టం ద్వారా తాము ఎన్నో సమస్యలను పరిష్కరించామని ఆయన చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here