సమాజంలో యువత పాత్ర కీలకం

0
218
సహజ యోగంలో అంతర్జాతీయంగా యువతకు ప్రాధాన్యత
దక్షిణాది రాష్ట్రాల సహజ యోగ సెమినార్‌ లో జాతీయ వైస్‌ చైర్మన్‌ దినేష్‌ రాయ్‌
రాజమహేంద్రవరం, సెప్టెంబర్‌ 7: ప్రస్తుతం సమాజం ఎదుర్కొంటున్న వివిధ రకాల సమస్యలను పరిష్కరించగలిగే సత్తా యువతకే ఉందని, అందుకే ప్రపంచ వ్యాప్తంగా సహజ యోగ ద్వారా యువతకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని సహజ యోగ జాతీయ ట్రస్ట్‌ వైస్‌ చైర్మన్‌ దినేష్‌ రాయ్‌ అన్నారు. రాజమహేంద్రవరంలో జరుగుతున్న సహజ యోగ దక్షిణాది రాష్ట్రాల రెండవ రోజు సెమినార్‌లో దేశాభివృద్ధిలో యువశక్తి ప్రాధాన్యత గురించి వివరించారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సహజ యోగ కో ఆర్డినేటర్‌ బోళ్ళ పద్మావతి మాట్లాడుతూ సహజ సిద్దంగా జరిగేదే ధ్యానమని, చిన్నతనం నుండి విద్యార్థులకు ధ్యానం పట్ల అవగాహన కల్పిస్తున్నామని,,దీని వలన మంచి అలవాట్లు కలగడంతో పాటు ఆధ్యాత్మికంగా మంచి ఉన్నతి కలుగుతుందన్నారు.సెమినార్‌ కో ఆర్డినేటర్‌ వెంకటరెడ్డి మాట్లాడుతూ యువత సహజ యోగాను చేయడం వలన జీవితంలో బాగా స్థిరపడతారని అన్నారు. రాష్ట్ర యువశక్తి కో ఆర్డినేటర్‌ ఎస్‌. శంకర్రావు మాట్లాడుతూ సహజ యోగా చేస్తూ పలువురు యువతి, యువకులు ఉద్యోగ,వ్యాపార రంగాలలో స్థిరపడి సహజ సేవ చేస్తున్నారని అన్నారు.తెనాలికి చెందిన యువశక్తి నవీన్‌ మాట్లాడుతూ 2004 నుండి తాను సహజ యోగ చేస్తున్నానని ,ఇప్పుడు ఎంబిఎ చేసి హెచ్‌ఆర్‌గా పని చేస్తూ ఆనందకరమైన జీవితాన్ని అనుభవిస్తున్నానని అన్నారు. సదస్సు ప్రారంభానికి ముందు కార్తికేయ పూజ చేశారు.అనంతరం ఢిల్లికి చెందిన లోటస్‌ ఫీట్‌ మదర్‌ సంగీత బృందంతో సామూహిక ధ్యానం చేయించారు.ఈ కార్యక్రమంలో వివిధ రాష్ట్రాల కన్వీనర్లతో పాటు ప్రపంచ ప్రఖ్యాత సంగీత విద్వాంసులు రాజేష్‌ యూనివర్స్‌, పండిట్‌ సుబ్రహ్మణ్యం, సురేష్‌ బాబు,శివరామకృష్ణ, యాళ్ళ రవికుమార్‌, అచ్యుతరామయ్య తదితరులు పాల్గొన్నారు. సెమినార్‌లో భాగంగా వివిధ రాష్ట్రాలకు చెందిన చిన్నారులు,యవత సాంస్క తిక కార్యక్రమాలు ఆకట్టుకుంటున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here