సమాజాభివృద్ధిలో సాంకేతికత పరిజ్ఞానం పాత్ర కీలకం

0
228

బొమ్మూరులో ప్రాంతీయ సైన్స్‌ కేంద్ర శంకుస్థాపనలో మంత్రి రాఘవరావు

రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 19 : సైన్సుతో సమాజాభివృద్ది సాధ్యమవుతుందని రాష్ట్ర అటవీ, సాంకేతిక శాఖ మంత్రి శిద్దా రాఘవారావు అన్నారు. రూరల్‌ మండలం బొమ్మూరులోని రూ. 15.20 కోట్ల రూపాయలతో నిర్మించనున్న సబ్‌ రీజనల్‌ సౖౖెన్సు కేంద్రానికి మంత్రి శంఖుస్దాపన చేశారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ 5 నెలలలో సైన్సు కేంద్రాన్ని నిర్మించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. అదనంగా ఇక్కడ సైన్సు హాబ్‌ ఏర్పాటుకు మరో కోటి 60 లక్షల రూపాయలు మంజూరు చేయించగలమని తెలిపారు. విశాఖపట్టణంలో 25 కోట్ల రూపాయలతో సైన్సు మ్యూజియం నిర్మాణం చేపట్టుటకు ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. సైన్సు సెంటర్ల ద్వారా విద్యార్ధులు ఎంతో విజ్ఞానం పెరుగుతుందని ఆయన అన్నారు. రాష్ట్రం లోటులో ఉన్నప్పటికి ఎక్కడ అభివృద్ది ఆగకుండా వేగవంతం చేస్తున్నామని ప్రజలందరిని అన్నివిధాల ఆదుకుంటున్నామని తెలిపారు. ఈ సందర్భంగా శాసనమండలి ఉపాధ్యక్షులు రెడ్డి సుబ్రహ్మాణ్యం మాట్లాడుతూ దేశ భవిష్యత్‌ను నిర్దేశించేది విద్యాలయలు అని అటువంటి విద్యాలయంలో మంచి పరిజ్ఞానాన్ని విద్యార్థులకు అందించాలని అయన అన్నారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల సహాకారంతో నిర్మింస్తున్న సైన్సు సెంటర్‌ వలన విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుందని అన్నారు. రాష్ట్రం విడిపోయాక 1,679 కోట్ల రూపాయలు లోటు బడ్జెట్‌లో ఉన్నప్పటికి అభివృద్ది పనులు వేగంగా జరుగుతున్నాయని అన్నారు. సైన్సు విద్యార్థులకు నిరంతరం ఉపయోగపడే పక్రియ అని అయన అన్నారు. సభకు అధ్యక్షత వహించిన రాజమహేంద్రవరం పార్లమెంట్‌ సభ్యులు మాగంటీ మురళిమోహన్‌ మాట్లాడుతూ సైన్సు సెంటర్‌ 5 ఎకరాలల్లో నిర్మాణానికి 50 శాతం నిధులు రాష్ట్రం, 50 శాతం నిధులు కేంద్రం సమాకూర్చడం జరుగుతుందని అయన అన్నారు. సైన్సు సెంటర్‌ వలన విద్యార్ధులలో మరింత విజ్ఞానం పెంపొందించగలదని ఆయన తెలిపారు. శాసనమండలి సభ్యులు ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడుతూ రాజమహేంద్రవరంనకు ఒక్క చరిత్ర ఉందని, ఇటువంటి ప్రాంతంలో సైన్సు సెంటర్‌ రావడం ఒక్క అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. ఇలాంటి కేంద్రాలను ఏర్పాటుచేయడం వలన విద్యార్థులలో మరింత విజ్ఞానం పెంపొదించేదుకు ఉపయోగపడుతుందని తెలిపారు. కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా మాట్లాడుతూ విద్యార్థి దశ నుండి సైన్సు సెంటర్‌లు వంటివి సందర్శించడం వలన మంచి తెలివితేటలు పెరుగుతాయని అయన అన్నారు. సైన్సు సెంటర్‌లు భవిష్యత్‌కు భాటగా ఉంటాయని తెలిపారు. సెంటర్‌ పనులు వేగవంతంగా పూర్తి చేయడానికి కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో రాజమహేంద్రవరం సబ్‌-కలెక్టర్‌ సి.ఎం.సాయికాంత్‌ వర్మ, నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ సైన్సు మ్యూజియం డైరెక్టర్‌(కల్‌కత్తా) యస్‌.కుమార్‌, ఎం.పి. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సాంకేతిక మండలి ప్రొజెక్ట్‌ అధికారి జె.డి రావు, తహశీల్దార్‌ కె.పోశయ్య,ఎం.డి.వో.రమణరెడ్డి, మురళీమోహన్‌ కోడలు మాగంటి రూప పాల్గోన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here