సమిష్టిగా సాగుదాం..విజయం సాధిద్దాం

0
254
మాజీ కార్పొరేటర్ల సత్కార సభలో ఎమ్మెల్యే భవానీ
రాజమహేంద్రవరం, జులై 4 :  తన గెలుపు వెనుక కార్పొరేటర్ల క షి మరువలేనిదని, వచ్చే కార్పొరేషన్‌ ఎన్నికల నేపథ్యంలో సమష్టిగా కలిసి ముందుకు వెళదామని  సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ పిలుపునిచ్చారు. నగర పాలక మండలి కాలపరిమితి నిన్నటితో ముగియడంతో తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్లకు స్థానిక మెయిన్‌ రోడ్డులోని జగదీశ్వరి ¬టల్లో సిటీ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో సత్కారం నిర్వహించారు. ఎమ్మెల్యే  భవానీ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. పార్టీని మరింత బలోపేతం చేయాలని ఆమె పిలుపునిచ్చారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటామన్నారు. అందరం సమైక్యంగా ఉండి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడుదామన్నారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి యర్రా వేణుగోపాల రాయుడు మాట్లాడుతూ కార్పొరేటర్లు ఐదేళ్లు మంచి పాలన అందించారని కొనియాడారు. ప్రజల సమస్యలపై బాగా స్పందించి వాటి పరిష్కారానికి క షి చేశారని అన్నారు. తెలుగుదేశం పార్టీ యువ నాయకులు ఆదిరెడ్డి శ్రీనివాస్‌ (వాసు) మాట్లాడుతూ చేసే ప్రతి కార్యక్రమాన్ని అందరికి చెప్పే చేస్తామన్నారు. అందరి సహకారంతో నగర పాలకసంస్థలో మళ్ళీ తెలుగుదేశం జెండా ఎగురవేస్తామన్నారు. అనంతరం వారిని ఘనంగా సన్మానించారు. నగర టీడీపీ ప్రధాన కార్యదర్శి రెడ్డి మణి అధ్యక్షత జరిగిన ఈ కార్యక్రమంలో ఆర్యాపురం కో ఆపరేటివ్‌ బ్యాంక్‌ మాజీ చైర్మన్‌ చల్లా శంకర్రావు, బిసి కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ పాలిక శ్రీను, బీసీ సంఘం నాయకులు రెడ్డి రాజు, బుడ్డిగ రాధ, చాంబర్‌ అధ్యక్షులు దొండపాటి సత్యంబాబు, మాజీ కో ఆప్షన్‌ సభ్యులు జక్కంపూడి శ్రీ రంగనాయకులు, ఉప్పులూరి జానకిరామయ్య, సురంపూడి శ్రీహరి, మాజీ కార్పొరేటర్లు, తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here