సరస్వతీ ఘాట్‌లో వైభవంగా సాగిన దీపోత్సవం

0
307
రాజమహేంద్రవరం, నవంబర్‌ 28 : నగరంలోని గౌతమ ఘాట్‌లో శ్రీ వాసవీ వైశ్య దీపిక,  శ్రీ జగద్గురు పీఠం,  శ్రీ సత్యసాయి ధ్యానమండలి, శ్రీ గాయత్రీ పీఠం, శ్రీ సిద్ధ సమాధి యోగ, శ్రీ ఉమర్‌ ఆలీషా స్వామి వారి పీఠం, శ్రీరంగధామం, శ్రీ దత్త ముక్తి క్షేత్రం, శ్రీ వ్యాసాశ్రమం, అమ్మా భగవాన్‌ ఆలయం, ఇస్కాన్‌, అయ్యప్ప ఆలయం, జ్ఞాన సరస్వతి పీఠం, సంయుక్త ఆధ్వర్యంలో  గత రాత్రి లక్ష దీపోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. శ్రీ జ్ఞాన సరస్వతీ పీఠం చారిటబుల్‌ ట్రస్ట్‌, గౌతమ ఘాట్‌ ఆధ్యాత్మిక సంస్థల సమాఖ్య అధ్యక్షుడు తోట సుబ్బారావు, గౌరవ అధ్యక్షుడు రంకిరెడ్డి  సుబ్బరాజు, కార్యదర్శి సీమకుర్తి సుబ్బారావు, ప్రతినిధులు రంకిరెడ్డి గోపాలకృష్ణ, ఆంజనేయులు, కూచిమంచి శ్రీనివాస్‌, సీతారామాంజనేయులు, ఎన్‌ఎస్‌ శర్మ, వీరవరం శ్రీనివాస్‌, దవులూరి రామకృష్ణ, ముద్రగడ కొండబాబు, ఇస్కాన్‌ ప్రభువుల పర్యవేక్షణలో లక్ష దీపోత్సవాన్ని నిర్వహించారు. తొలుత జ్ఞాన సరస్వతీ వాస్తు జ్యోతిష ప్రవీణ ప్రభల సుబ్రహ్మణ్య శర్మ కార్తీక మాస దీప ప్రాశస్త్య ప్రవచనం, కార్తీక దామోదర పూజ నిర్వహించారు.  ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చిన రాజప్ప, రూరల్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి, ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, ఆర్యాపురం అర్బన్‌ బ్యాంక్‌ చైర్మన్‌ చల్లా శంకరరావు, తదితర నగర ప్రముఖులు  ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సరస్వతీ ఘాట్‌లో వేదికపై ఏర్పాటు చేసిన స్వర్ణ మహాలక్ష్మీని, స్వర్ణ గణపతి విగ్రహాలను ముఖ్య అతిధులు దర్శించుకున్నారు. అనంతరం హోం మంత్రి రాజప్ప లక్ష దీపోత్సవాన్ని తిలకించారు. ఈ సందర్భంగా రాజప్పను, ఎమ్మెల్యే గోరంట్లను, ఆర్యాపురం సహకార అర్బన్‌ బ్యాంక్‌ చైర్మన్‌ చల్లా శంకరరావును, కార్పొరేటర్‌ కొమ్మ శ్రీనివాస్‌ను  రంకిరెడి ్డ సుబ్బరాజు, తోట సుబ్బారావులు సత్కరించారు. అనంతరం రాత్రి దీపోత్సవాన్ని ప్రారంభించారు. అంతకు ముందు మహా రుద్రాభిషేకాన్ని నిర్వహించారు.  భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా కల్కి భగవాన్‌ వాలంటీర్లు సేవలందించారు. దీపోత్సవాన్ని పురస్కరించుకుని సరస్వతీ ఘాట్‌ వద్ద నదీలో నావలపై కాల్చిన బాణాసంచ  ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.   ఈ కార్యక్రమంలో ట్రిప్స్‌ స్కూలు అధినేత బాలా త్రిపుర సుందరి, నగర ప్రముఖులు ఆంజనేయ గురుస్వామి, సూరంపూడి శ్రీహరి, పొత్తూరి బాల నాగేశ్వరరావు, అరిగెల బాబూ నాగేంద్ర ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.