సర్వజన సంక్షేమమే ధ్యేయం

0
497
క్రైస్తవ స్మశాన వాటికకు 6 ఎకరాలు – జాంపేట మసీదు కమ్యూనిటీ హాలుకి రూ. కోటి
కాపు కల్యాణ మంటపానికి రూ కోటి – రూరల్‌లో రూ 80లక్షలతో 9 బిసి కమ్యూనిటీ హాల్స్‌
రూరల్‌ ఎమ్మెల్యే గోరంట్ల వెల్లడి
రాజమహేంద్రవరం, జూలై 6 : అటు రాష్ట్రంలో, ఇటు నియోజకవర్గాల్లో అభివ ద్ధి, సంక్షేమమే ధ్యేయంగా పనులు చేసుకుంటూ ప్రభుత్వం ముందుకు వెళ్తోందని రాజమహేంద్రవరం రూరల్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. రూరల్‌, సిటీ నియోజక వర్గాల్లో పలు సమస్యలు పరిష్కారానికి చర్యలు చేపట్టినట్లు ఆయన తెలిపారు. ప్రెస్‌క్లబ్‌లో ఈ ఉదయం డిప్యూటీ మేయర్‌ వాసిరెడ్డి రాంబాబు, టిడిపి ఫ్లోర్‌ లీడర్‌ వర్రే శ్రీన్విసరావు, కార్పొరేటర్‌ పాలిక శ్రీను, జిల్లా టీఎన్‌టియుసి అధ్యక్షులు నక్కా చిట్టిబాబు తదితరులతో కల్సి ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.  క్రైస్తవ స్మశానవాటికకు 6 ఎకరాలు సేకరించి, మున్సిపల్‌ కార్పొరేషన్‌కి దఖలు పరిచామని, ఇక్కడ సౌకర్యాల కల్పనకు తాను చేసిన విజ్ఞప్తికి స్పందించి ప్రభుత్వం  కోటి రూపాయలను మంజూరు చేసిందని ఆయన చెప్పారు. కార్పొరేషన్‌, అలాగే సీఎం నిధులతో స్మశాన  వాటిక అభివ ద్ధి చేస్తామని, అలాగే మరిన్ని హంగుల కోసం క్రైస్తవులు కూడా కొంత సొమ్ము వెచ్చించడానికి నిర్ణయించారని ఆయన తెలిపారు. అవసరమైతే మరో రెండు ఎకరాలను కూడా అదనంగా సేకరించాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు.
బొమ్మూరు డైట్‌ అభివ ద్ధికి నిధులు
బొమ్మూరు డైట్‌ అభివ ద్ధికి 3 కోట్ల 45 లక్షల రూపాయలతో ప్రతిపాదనలు పంపగా, 2 కోట్ల 95 లక్షల రూపాయలు మంజూరు అయ్యాయని గోరంట్ల చెబుతూ లేబరేటరీ, ఆడిటోరియం,ఫిజియాలజి వంటి హంగులు సమకూరనున్నాయని వివరించారు. అలాగే  రెండు కోట్ల రూపాయలతో  హాస్టల్‌  ఒకటి రాబోతోందని చెప్పారు. బాల మహిళా ప్రాంగణానికి నిధులు రావాల్సి ఉందన్నారు. ఇక నగరంలోని ట్రైనింగ్‌ కాలేజీ అభివ ద్ధిపై కూడా ద ష్టి పెట్టామని, ఆధునీకరించడానికి నిధులకోసం ప్రతిపాదనలు వెళ్లాయని ఆయన చెప్పారు. కాపు కల్యాణ మండపం కోసం కోటి రూపాయలు మంజూరు అయ్యాయని ఆయన చెబుతూ నిర్మాణానికి చర్యలు తీసుకోవాల్సి ఉందన్నారు. అలాగే రూరల్‌ ప్రాంతంలో తొమ్మిది బిసి కమ్యూనిటీ హాల్స్‌ నిర్మాణానికి రూ. 80లక్షలు మంజూరు అయ్యాయని ఆయన తెలిపారు. జాంపేట లబాబీన్‌ లైన్‌ మసీదు కమ్యూనిటీ హాలుకి కోటి రూపాయలు మంజూరు అయ్యాయని గోరంట్ల తెలిపారు. ధవళేశ్వరం సాయిబాబా  గుడినుంచి జనార్ధన స్వామి ఆలయం వరకూ 7కోట్ల 27లక్షల రూపాయలతో  గోదావరి గట్టు పటిష్టం చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఎస్టీపీ ప్లాంట్‌ రూ. 18కోట్లతో పూర్తి చేయడంతో పాటు 82కోట్లతో డిస్పోజల్‌ ప్రాజెక్ట్‌ కూడా చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. దీర్ఘకాలికంగా వున్న సమస్య పరిష్కారానికి అంచనాలు వేయించి పంపించామని, 30.85 కిలోమీటర్ల మేరకు డ్రైన్స్‌ రాబోతున్నాయని ఆయన తెలిపారు. టెండర్లు అయ్యాయని, పనులు ప్రారంభం కావలసి ఉందన్నారు. కంబాలచెర్వు అభివృద్ధి పనులు సాగుతున్నాయని, ఇక్కడ మరో కల్వర్టు వస్తుందని ఆయన చెప్పారు. ఇన్నీసుపేట, గూడ్స్‌షెడ్‌ దగ్గర ముంపు నివారణకు రైల్వేకు రెండున్నర కోట్ల రూపాయలు ప్రభుత్వం డిపాజిట్‌ చేసిందని ఆయన చెప్పారు.
80ఎకరాలు సేకరణతో, 10వేల ఇళ్ళు…
రూరల్‌లో 80 ఎకరాలను ఇళ్ల నిర్మాణానికి సేకరిస్తున్నామని, ఇందులో 4వేల ఇళ్ళు రూరల్‌ కి వెళ్తాయని, మిగిలిన ఇల్లు సిటీలో వారికి వస్తాయని గోరంట్ల సూచించారు.  ఇళ్ళు కేంద్రం మంజూరు చేసినా, సకాలంలో డబ్బులు మాత్రం ఇవ్వడం లేదని ఆయన అన్నారు. సీఎం రిలీఫ్‌ ఫండ్‌ కింద మొన్న ఆరుగురికి వైద్య ఖర్చులు అందించగా, ఇప్పుడు మరో ఆరుగురికి నాలుగు లక్షల రూపాయలు మంజూరు అయ్యాయని, చెక్కులు సిద్ధం చేసినందున ఇక అందించడమే మిగిలిందని ఆయన చెప్పారు.
పోలవరానికి మడత పేచీయా
కేంద్రం ఇవ్వాల్సింది ఇవ్వకుండా అన్నీ ఇచ్చేశాం అని సుప్రీంకోర్టులో అఫిడవిట్‌  వేయడంలో అర్థంలేదని గోరంట్ల పేర్కొంటూ చివరకు పోలవరానికి కూడా మడత పేచీ పెడుతున్నారని ఆయన వాపోయారు.  బిజెపి నాయకులు సోము వీర్రాజు, కన్నా లక్ష్మి నారాయణ , జివిఎస్‌ నరసింహారావు తదితర నేతలు వాస్తవాలను తొక్కిపెట్టి రాష్ట్ర ప్రభుత్వంపై బురద జల్లేలా ఏదేదో మాట్లాడుతున్నారని ఆయన అన్నారు.  ఇక జగన్‌, పవన్‌ కూడా కేంద్రాన్ని అడక్కుండా, చంద్రబాబుని విమర్శించడం తగదన్నారు.  సీమాంధ్రులు ఐక్యంగా ఉండడం ద్వారా మనకు రావాల్సినవి సాధించుకోవాలన్నారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తున్నా, కేంద్రం ఎఫ్‌సిఐల ద్వారా కొనుగోళ్లు చేయడం లేదన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here