సామాజిక సేవే లక్ష్యంగా 

0
290
సంబరాలకు దూరంగా…
గన్ని కృష్ణ పుట్టినరోజు సందర్భంగా కరుటూరి అభిషేక్‌ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం
రాజమహేంద్రవరం, నవంబర్‌ 23 : గుడా చైర్మన్‌ గన్ని కృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఆయన ఇచ్చిన పిలుపును అందుకుని యువత సంబరాలకు దూరంగా సామాజిక సేవా కార్యక్రమాలే లక్ష్యంగా పనిచేశారు. టిఎన్‌ఎస్‌ఎఫ్‌ నాయకులు కరుటూరి అభిషేక్‌ ఆధ్వర్యంలో ప్రభుత్వాసుపత్రిలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ రక్తదాన శిబిరాన్ని గన్ని కృష్ణ ప్రారంభించి వారిని అభినందించారు. సంబరాలకన్నా సామాజిక సేవలో నిజమైన సంతృప్తి ఉంటుందని, యువత ఆ దిశగా నడుచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రమేష్‌ కిషోర్‌, పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here