సామాన్యులకు శిక్ష వేసిన మోడీ 

0
247
పెద్ద నోట్ల రద్దుపై సబ్‌ కలెక్టర్‌  కార్యాలయం వద్ద కాంగ్రెస్‌ ధర్నా
రాజమహేంద్రవరం, జనవరి 7 : పెద్ద నోట్ల రద్దు వల్ల సామాన్యులకు ప్రధాని మోడీ శిక్ష విధించారని, నల్ల కుబేరులు హాయిగా ఉన్నారని నగర కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఎన్‌.వి.శ్రీనివాస్‌ అన్నారు. నగర కాంగ్రెస్‌ ఆధ్వర్యాన ఈరోజు సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం వద్ద పెద్ద నోట్ల రద్దును నిరసిస్తూ ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నల్ల ధనం ఎంత వెలికితీశారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఆకస్మికంగా తీసుకున్న రద్దు నిర్ణయం వల్ల అనేకమంది చనిపోయారని, వారి కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. వ్యాపారాలు లేక చాలామంది ఉపాధి కోల్పోయారని, అలాంటి వారిని ఏ విధంగా ఆదుకుంటారని ప్రశ్నించారు. 130 కోట్ల జనాభా కలిగిన దేశానికి ప్రధానిగా ఉన్న మోడీ నిర్ణయాలు తీసుకునేటప్పుడు అందరితోనూ చర్చించాల్సిన అవసరం ఉందని, ఆయన అనాలోచిత నిర్ణయం వల్ల దేశం ఆర్థిక సంక్షోభంలోకి నెట్టివేయబడిందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శులు దాసి వెంకట్రావు, గుళ్ళ ఏడుకొండలు,దాకే రఘు కార్పొరేటర్‌ రాయుడు సతీష్‌, ముళ్ళ మాధవ్‌, ఎస్‌.ఎ.కె.అర్షద్‌, ఎస్‌.కె.జిలాని, బాలేపల్లి మురళీధర్‌, బెజవాడ రంగా, అబ్దుల్లా షరీఫ్‌, గోలి రవి, కొల్లిమళ్ళ రఘు, తాళ్ళూరి విజయకుమార్‌, నలబాటి శ్యామ్‌, ఉసురుమర్తి ఆనంద్‌, షహెన్‌షా, కొమాండూరి కుమారి, కాటం రవి, తదితరులు పాల్గొన్నారు.