సింగ్‌ ఆధ్వర్యంలో శ్యాంప్రకాష్‌ ముఖర్జీ జయంతి వేడుకలు

0
108
రాజమహేంద్రవరం, జులై 6 :  భారతీయ జన సంఘ్‌ అధ్యక్షులు డాక్టర్‌ శ్యామ్‌ప్రకాష్‌ ముఖర్జీ జయంతి వేడుకలు బిజెపి రాష్ట్ర నాయకులు క్షత్రియ బాలసుబ్రహ్మణ్యసింగ్‌ ఆధ్వర్యంలో జరిగాయి. లాలాచెరువు రోడ్‌లోని జీవకారుణ్య సంఘంలో జరిగిన ఈ వేడుకల్లో మొదటిగా శ్యామ్‌ప్రకాష్‌ ముఖర్జీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జీవకారుణ్య సంఘం వృద్ధులకు పండ్లు, స్వీట్లు, బిస్కట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సింగ్‌ మాట్లాడుతూ డాక్టర్‌ శ్యాంప్రసాద్‌ ముఖర్జీ జీవితం ఆదర్శప్రాయమని, ఆయనను స్ఫూర్తిగా తీసుకుని బిజెపి కార్యకర్తలు కష్టపడి పనిచేయాలన్నారు. ప్రజా సమస్యలపై, పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాల్లో కార్యకర్తలు చురుగ్గా పాల్గొనాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో క్రొవ్విడి సురేష్‌కుమార్‌, ఎన్‌.ఎస్‌.ఎస్‌.చంద్రశేఖర్‌, జి.వెంకటరమణ, పి.వెంకట్రావు, రాయుడు వెంకటేశ్వరరావు, కొప్పోజు తమ్మాజీ, వై.శ్యామ్‌, సంజయ్‌, జి.అప్పారావు, జి.సుదర్శనరావు, ఈశ్వరరావు, తేజ, మంగరాజు, కిరణ్‌, కె.సురేష్‌, తులసి, రాజేశ్వరి, ఎస్‌.విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here