సిఎం పర్యటనకు చురుగ్గా ఏర్పాట్లు

0
204
‘దిశ’ పోలీస్‌ స్టేషన్‌ను పరిశీలించిన డిజిపి గౌతమ్‌ సవాంగ్‌
రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 5 : ఈ నెల ఏడో తేదీన రాజమహేంద్రవరం నగరంలో ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లును రాష్ట్ర డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ ఈరోజు పరిశీలించారు. ముందుగా నగరానికి వచ్చిన ఆయన అర్బన్‌ ఎస్పీ కార్యాలయానికి వెళ్లి ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లుపై పోలీసు ఉన్నతాధికారులతో చర్చించారు. అనంతరం స్వామి థియేటర్‌ ఎదురుగా ఏర్పాటు చేస్తున్న ‘దిశ’ పోలీస్‌స్టేషన్‌ భవనాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా దిశ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన వివిధ విభాగాలు, ఇతర అంశాలను పోలీసు అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం నన్నయ యూనివర్శిటీలో ఏర్పాటు చేసిన దిశ యాప్‌, దిశ చట్టంపై ముద్రించిన పుస్తకం ప్రారంభోత్సవం కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు, ఇతర భద్రతా వ్యవహరాలపై ఆయన సమీక్షించారు. ఈ పర్యటనలో ఏలూరు రేంజ్‌ డిఐజి ఎఎస్‌ ఖాన్‌, అర్బన్‌ జిల్లా ఎస్పీ షీమోషీ బాజ్‌పేయ్‌, తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ నయీం అస్మీ, అడిషనల్‌ ఎస్పీ లతా మాధురి, మురళీకృష్ణ, వై.వి రమణకుమార్‌, ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here