సిగ్గుందా మీకు ?

0
352
బిజెపి నేతలపై గన్ని ఫైర్‌ – రేపు శాంతియుతంగా నిరసన తెలియజేద్దాం
రాజమహేంద్రవరం, జనవరి 31 : సీఎం చంద్రబాబునాయుడుపై ఉన్న విశ్వసనీయత, ఆయన పట్ల ఉన్న నమ్మకంతో కియా మోటర్స్‌ రాష్ట్రానికి వస్తే మోడీ వల్లే అంటూ కన్నా లక్ష్మీనారాయణ,ఇతర బిజెపి నేతలు అవాస్తవాలను వాస్తవాలుగా మలచడానికి ప్రయత్నించడం సిగ్గుచేటని గుడా చైర్మన్‌ గన్ని కృష్ణ మండిపడ్డారు.  కియా మోటర్స్‌ను గుజరాత్‌కు తరలించడానికి మోడీ ప్రయత్నించినప్పటికీ సీఎం చంద్రబాబు కార్యదక్షతతోనే  ఈ రాష్ట్రానికి వచ్చిందన్నారు. కన్నా, సోము, రాంమాధవ్‌ వంటి నాయకులు విశాఖకు రైల్వే జోన్‌ సాధించలేకపోయారని, చంద్రబాబు కృషితో వచ్చిన ప్రాజక్ట్‌లను వారి ఖాతాల్లో వేసుకోవడానికి ప్రయత్నించడాన్ని గన్ని ఖండించారు. ప్రత్యేక హోదాపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశానికి ప్రతిపక్షనేత జగన్‌ రాకపోవడం ఆశ్చర్యం కలిగించలేదన్నారు. హోదా సాధనకు రేపు జరగనున్న నిరసన కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ శాంతియుతంగా పాల్గొని నల్లబ్యాడ్జిలు ధరించి తమ ఆందోళనను వ్యక్తం చేయాలని గన్ని కోరారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here