సిపిఐ పార్టీని ప్రజల పార్టీగా తీర్చిదిద్దండి  

0
144
జిల్లా కార్యదర్శి తాటిపాక మధు పిలుపు
రాజమహేంద్రవరం, మే 28 :  ఆయా వార్డులలో ప్రజా సమస్యలు  తీసుకొని పని చేయాలని  అప్పుడే పార్టీ ప్రజల పార్టీ గా ఉంటుందని సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం సిపిఐ కార్యాలయంలో రాజమహేంద్రవరం పార్టీ నగర కార్యవర్గ సమావేశం వానపల్లి సూర్యనారాయణ అధ్యక్షతన జరిగింది. ముందుగా మధు మాట్లాడుతూ రానున్న రోజుల్లో పార్టీ శ్రేణులు జిల్లా వ్యాప్తంగా శాఖల వారీగా అన్ని వర్గాల సమస్యలను తీసుకుని  పనిచేయాలని ఆయన పేర్కొన్నారు. గోదావరి చెంతనే ఉన్నా మంచినీటి ఎద్దడి ఉందని అయన అన్నారు. ముఖ్యంగా నూతన ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల వాగ్దానాలు అమలు చేసే విధంగా మన పోరాట కార్యక్రమం ఉండాలని పార్టీని నిర్మాణాత్మకంగా దృష్టి పెడితే ప్రజల పార్టీగా ఉంటుందని ఆయన తెలిపారు .అలాగే  ఇప్పటికీ చాలామందికి స్వంత ఇల్లు గ హం లేక ఇబ్బందులు పడుతున్నారని అందరికీ సొంత ఇళ్లస్థలాలు ఇవ్వాలని ఆయన పేర్కొన్నారు. సిపిఐ నగర కార్యదర్శి నల్లా రామారావు మాట్లాడుతూ ఏఐటియుసి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులు జూన్‌ 20 21 తేదీల్లో పెద్దాపురంలో జరుగుతున్నాయని కార్మిక వర్గాలు అందరూ హాజరు కావాలని ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా ఏఐటియుసి జాతీయ స్థాయి సమావేశాలు విశాఖపట్నంలో జరుగుతున్నాయని వాటిని కూడా జయప్రదం చేయుటకై కార్మికులు క షి చేయాలని  ఆయన పేర్కొన్నారు .వచ్చే మున్సిపల్‌ ఎన్నికల్లో సిపిఐ నిర్మాణాత్మకంగా ఉంటుందని ప్రజలు సమస్యలు తీసుకుని వాటి కోసం  పని చేస్తామని  పేర్కొన్నారు. కార్యక్రమంలో నగర సహాయ కార్యదర్శులు తోకల ప్రసాద్‌,  వంగమూడి కొండలరావు, పార్టీ నాయకులు యడ్ల అప్పారావు, నల్లా  భ్రమరాంబ, బొమ్మసాని రవి, ఎస్‌.సూరిబాబు, నల్ల కుమారి తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here