సి.సి.సి. కార్యాలయంలో  ఘనంగా క్రిస్మస్‌ వేడుకలు 

0
231
 రాజమహేంద్రవరం, డిసెంబర్‌ 22 : దానవాయిపేటలోని సి.సి.సి.  ఛానల్‌లో  క్రిస్మస్‌ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సి.సి.సి. ఎండి పంతం కొండలరావు సారధ్యంలో జరిగిన ఈ వేడుకలను వినోద కార్యక్రమాలతో ఆరంభించారు. యాంకర్‌ సుకుమార్‌ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ, క్రిస్మస్‌ గీతాలాపన చేస్తూ, కార్యక్రమాన్ని నడిపించారు. బ్రదర్‌ సుందర్‌ ప్రత్యేక గీతం ఆలపించారు.  రెవ. అరుణకుమార్‌, రెవ. రవిరాజ్‌ క్రీస్తు సందేశం అందించారు. బిషప్‌ కెవి రత్నం,బిషప్‌ పొన్నమాటి బాబ్జి,  రెవ. ఆనందరావు,రెవ. కె సుదర్శన్‌,రెవ. పి. రాజకుమార్‌,రెవ. సత్యం, దైవ సందేశాలు వినిపించారు.  సూర్య సాయంకాలం పత్రిక సంపాదకులు విఎస్‌ఎస్‌ కృష్ణకుమార్‌ అధ్యక్షత వహించారు.పంతం కొండలరావు మాట్లాడుతూ ఇంతమంది మిత్రులు,శ్రేయోభిలాషులు,సిబ్బంది ఉండడం వల్లనే ఇలాంటి కార్యక్రమాలు చేయగలుగు తున్నామన్నారు. సహాయ కార్యక్రమాలు చేయడానికి డబ్బు ఉండనవసరం లేదని ఆయన చెబుతూ నీళ్లు పోసి తొట్టె పెడితే పక్షులు నీళ్లు తాగుతాయని,మొక్కలు నాటడం ద్వారా పర్యావరణాన్ని కాపాడ వచ్చని,ప్లాస్టిక్‌ బాగ్‌ లు వదిలిపెట్టి నార సంచులు, గుడ్డ సంచులు వాడడం ద్వారా కాలుష్యాన్ని నివారించవచ్చని ఇలా ఎవరి స్థాయిలో వాళ్ళు సమాజానికి సేవ చేయవచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతిఒక్కరికి కొండలరావు కృతజ్ఞతలు  తెల్పుతూ క్రిస్మస్‌  శుభాకాంక్షలు తెలియజేసారు. ప్రెస్‌ క్లబ్‌ అధ్యక్షులు కుడుపూడి పార్ధసారధి, ప్రెస్‌క్లబ్‌  గౌరవ అధ్యక్షులు మండేల  శ్రీరామమూర్తి, ప్రెస్‌ క్లబ్‌ మాజీ కార్యదర్శి డి ఏ లింకన్‌ మాట్లాడారు. దుళ్ల  సర్పంచ్‌ కొండయ్య మాస్టారు,  ప్రెస్‌ క్లబ్‌  కార్యదర్శి గణపతి, ఎన్‌ ఎస్‌,   రాజానగరం ఎం ఎస్‌ ఓ పీతా శేషగిరి, కేబుల్‌ ఆపరేటర్లు నొడగల సుధ,నండూరి సుబ్బారావు,ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం,వాసంశెట్టి సూర్య గణేష్‌,కంచుమర్తి చంటి, బ్రూస్‌ లీ శ్రీను,ప్రిన్స్‌ రవి, గిరజాల శ్రీను, జాంపేట  బ్యాంకు డైరెక్టర్‌ ముప్పన శ్రీను,మాజీ కార్పొరేటర్‌ నేతల రామచంద్రరావు తదితరులు వేదికపై ఆశీనులయ్యారు. సిసిసిస్టాఫ్‌ ఆంటోని,శ్యాం కిరణ్‌,హరిక ష్ణ,క పానందం,అంబి,హరి,రాజేష్‌,పండు, రాణి,రాఘవమ్మ,మణి  తదితరులు పర్యవేక్షించారు. సిసిసి  మేనేజర్‌ వంక రాజేంద్ర,యాడ్స్‌ మేనేజర్‌  చల్లా ప్రవీణ్‌,బులుసు ప్రకాష్‌,న్యూస్‌ రీడర్‌ ప్రగళ్లపాటి  ప్రతాప్‌, ఇంకా పలువురు ఆపరేటర్లు,సిబ్బంది పాల్గొన్నారు.  క్రిస్మస్‌ కేట్‌ కటింగ్‌,దైవ ఆరాధన కార్యక్రమాల అనంతరం  వ ద్ధ మహిళలకు చీరల పంపిణి,సిసిసి స్టాఫ్‌కి బట్టలు పంపిణీ నిర్వహించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here