సీఎంగా మీరు మాట్లాడే మాటలేనా ఇవీ బాబూ!

0
312

ఎవరికి ఎవరు రక్షణ కల్పిస్తారు ?

సెంటిమెంట్‌ పనిచేయదనే అలిపిరి ఘటన ప్రస్తావించా

కేంద్రం హామీలు నెరవేరుస్తుంది : ఎమ్మెల్సీ సోము వీర్రాజు

రాజమహేంద్రవరం, ఏప్రిల్‌ 25 : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్న వ్యాఖ్యతో రాష్ట్ర ప్రజలు నివ్వెర పోతున్నారని బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు పేర్కొన్నారు. స్ధానిక ప్రెస్‌క్లబ్‌లో బుధవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వీర్రాజు మాట్లాడుతూ ముఖ్యమంత్రి తనను ప్రజలు రక్షించాలని అంటే ఇంక రాష్ట్ర ప్రజలను ఎవరు రక్షిస్తారని ప్రశ్నించారు. పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సైతం ఎన్నడూ ఇటువంటి ఆలోచన చేయలేదన్నారు. ఇటువంటి వ్యాఖ్యలు ద్వారా రాజ్యాంగాన్ని ముఖ్యమంత్రి అవహేళన చేస్తున్నారని విమర్శించారు. రాజ్యాంగంపై మీకు గౌరవం ఉందాని ప్రశ్నించారు. ప్రస్తుతం గవర్నర్‌ నరసింహన్‌ సమక్షంలోనే ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారని, అలాగే వైసిపి నుంచి వచ్చి చేరిన నలుగురు ఎమ్మెల్యేలచేత సిఎం సూచనల మేరకు నరసింహన్‌ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయించారని, ఉభయ సభల సమావేశంలో రాష్ట్ర ప్రగతి గురించి నరసింహన్‌తో చెప్పించారని, అలాగే బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా ప్రత్యేక ¬దా రాష్ట్ర హక్కు అని చెప్పించారని, అప్పుడు నచ్చిన గవర్నర్‌ ఇప్పుడు ఎందుకు నచ్చడం లేదని ప్రశ్నించారు. రాజకీయాల్లోకి రాజ్యాంగ వ్యవస్ధను తీసుకువచ్చి రాజ్యాంగాన్ని ఎందుకు కించపరుస్తారని ప్రశ్నించారు. వ్యవస్ధను మేనేజ్‌ చేయలేకపోతున్నారా? అని ప్రశ్నించారు. కేంద్రంలో బలమైన ప్రభుత్వం ఉండటం రాజ్యాంగ వ్యవస్ధ స్వేచ్ఛగా పనిచేస్తుండటం ‘మీకు’ కష్టంగా ఉందా అని ప్రశ్నలు సంధించారు. మంగళవారం జరిగిన సమావేశం అనేది కేంద్రప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. పంచాయితీలు ప్రగతికి అభియాన్‌ అని కేంద్రం దేశంలోని అన్ని రాష్ట్రాలలోని గ్రామపంచాయితీలలో ఈ సభలు నిర్వహించిందన్నారు. పంచాయితీలలో ఏయే సంక్షేమ పధకాలు ఏవిధంగా అమలు జరుగుతున్నాయి, పంచాయితీలు ఎంతమేరకు అభివృద్ధి చెందాయి. మరింత అభివృద్ధికి ఏమేమి పధకాలు అమలు చేయాలో చర్చించి, అవసరమైన నిర్ణయాలు చేయడానికి ఉద్దేశించి ఈ సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అయితే జిల్లాలో జరిగిన సమావేశాలలో అటువంటి చర్చలు జరిగిన దాఖలాలు ఏవీ కన్పించలేదన్నారు. ప్రతి గ్రామంలో వెలుగులు నింపాలని ఎల్‌ఇడి లైట్‌లను కేంద్రం అందిస్తుందన్నారు. 24 గంటలు నిరంతర విద్యుత్‌ను సరఫరా చేస్తుందన్నారు. విద్యుత్‌ ఆదా చేయడానికి ఎల్‌ఇడి బల్బులను సరఫరా చేస్తుందన్నారు. నగరంలో రూ.110 కోట్లతో అమృత పధకం ప్రారంభమయ్యిందని, ఇందులో 60శాతం నిధులు కేంద్రం ఇస్తుందన్నారు. ఎస్సీ నిధులతో రోడ్ల నిర్మాణం జరుగుతుందన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి అంతా కేంద్ర ప్రభుత్వ పధకాలతోనే అన్నారు. కేంద్రం తోడ్పాటును ఇవ్వడం వల్లే రాష్ట్రం రెండంకెల వృద్ధి రేటును సాధించిందన్నారు. కేంద్రం అన్ని విధాల సాయం అందిస్తుందని గతంలో ఈ నేతలే అనేక సార్లు ప్రకటనలు కూడా చేసారని గుర్తుచేసారు. మిత్రపక్షంగా ఉండగా నామినేటెడ్‌ పోస్టుల్లో అవకాశాలు ఇవ్వలేదన్నారు. కేంద్రం అందించిన 6లక్షల ఇళ్ళల్లో బిజెపి కార్యకర్తలు చెప్పిన వారికి కనీసం 10 ఇళ్ళు కూడా ఇవ్వలేదన్నారు. బాలకృష్ణ వాడిన భాష సరిగా లేదని బిజెపి నేతలు ఆయన దిష్టిబొమ్మ దహనం చేస్తే బిజెపి నేతలపై కేసులు పెడుతున్నారన్నారు. తనకు 25 ఎంపి సీట్లు ఇస్తే ఎవరినైనా నియంత్రణ చేసి రాష్ట్రానికి ప్రత్యేక ¬దా సాధిస్తాననడం విడ్డూరంగా ఉందన్నారు. 2004లో అలిపిరి సంఘటన తర్వాత సెంటిమెంట్‌ పనిచేస్తుందని చెప్పి ముందస్తు ఎన్నికలకు వెళ్ళడం ద్వారా కేంద్రంలోని వాజ్‌పేయ్‌ని కూడా వెనక్కి లాగేసారని, ఇప్పుడు ప్రత్యేక ¬దా సెంటిమెంట్‌ పనిచేస్తుందన్న భావనతో చంద్రబాబు ఆలోచనలో ఉన్నారని, 2004లో దెబ్బతిన్నట్లే, ఇప్పుడు దెబ్బతింటారన్నదే తన భావన తప్ప, అలిపిరి సంఘటన పునరావృతం అవుతుందని తాను చెప్పలేదని వివరణ ఇచ్చారు. తాము దేశభక్తి భావనతో, దేశానికి సేవ చేయాలన్న ఆలోచనతో పనిచేస్తామే తప్ప, మరో ఆలోచనతోనో, ఉద్దేశాలతోనో రాజకీయాలు చేయబోమని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. విశాఖ రైల్వే జోన్‌, కడప ఉక్కు ఫ్యాక్టరీ వంటి హామీలను బిజెపి ప్రభుత్వం తప్పుకుండా నెరవేరుస్తుందన్నారు. విలేకరుల సమావేశంలో బిజెపి అర్బన్‌ జిల్లా అధ్యక్షులు బొమ్ముల దత్తు, కార్పొరేటర్‌ రేలంగి శ్రీదేవి, అర్బన్‌ జిల్లా బిజెపి ప్రధాన కార్యదర్శులు అడబాల రామకృష్ణారావు, బూర రామచంద్రరావు, నాయకులు ధార్వాడ రామకృష్ణ, యెనుముల రంగబాబు, నల్లమిల్లి బ్రహ్మానందం, పడాల నాగరాజు, వీరా వీరాంజనేయులు, రూరల్‌ అధ్యక్షులు యానాపు యేసు, పసలపూడి శ్రీనివాస్‌, కాలెపు సత్యసాయిరామ్‌, బేతిరెడ్డి ఆదిత్య, తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here