సీఎం పర్యటనా ఏర్పాట్లను పరిశీలించిన ఐ.జి. గుప్తా 

0
345
రాజమహేంద్రవరం, నవంబర్‌ 17 : నగరంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పర్యటనా ఏర్పాట్లను లా అండ్‌ ఆర్డర్‌  ఐజి. గుప్తా ,ఏలూరు రేంజి డి.ఐ.జి. పి.రామకృష్ణ  ఈరోజు పరిశీలించారు.  ముందుగా శాటిలైట్‌సిటీకి వెళ్ళి  అక్కడ చంద్రబాబు పాల్గొనే జన చైతన్యయాత్ర కార్యక్రమం సందర్భంగా తీసుకోవలసిన భద్రతా చర్యలపై అధికారులతో చర్చించారు.  ఆ తర్వాత చెరుకూరి కన్వెన్షన్‌ సెంటర్‌, మున్సిపల్‌ స్టేడియం ప్రాంగణాలను వారు పరిశీలించారు. ఆ తర్వాత ఆర్ట్సు కళాశాలలో జరగనున్న దళిత, గిరిజన మహా గర్జన సభా ప్రాంగణాన్ని సందర్శించి భద్రతా చర్యలపై పరిశీలించారు. అక్కడ సభా ఏర్పాట్ల వివరాలను డి.ఐ.జి.కి రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్‌ మాజీ చైర్మన్‌ కారెం శివాజీ వివరించారు.  డి.ఐ.జి. వెంట సబ్‌ కలెక్టర్‌ విజయ్‌కృష్ణన్‌, ఇన్‌ఛార్జి అర్బన్‌ ఎస్పీ గోపీనాథ్‌ జెట్టీ, డిఎస్పీ కులశేఖర్‌, మాల మహానాడు నాయకులు  తాళ్ళూరి బాబూ రాజేంద్రప్రసాద్‌, అజ్జరపు వాసు, కోరుకొండ చిరంజీవి, తుమ్మల తాతారావు, ఎల్‌.వి.ప్రసాద్‌, మారే వెంకటేశ్వరరావు తదితరులు ఉన్నారు.