సీజనల్‌ వ్యాధులపై  అప్రమత్తత అవసరం

0
240
రాజమహేంద్రవరం, సెప్టెంబర్‌ 26 :  సీజనల్‌ వ్యాధులపై  ప్రజలు అప్రమత్తతో ఉండాలని ప్రముఖ వైద్యురాలు డా.అనసూరి పద్మలత సూచించారు. దీనిపై ముఖ్యంగా విద్యార్ధులు చైతన్యవంతులై ప్రజల్ని జాగృతి పర్చాలని అన్నారు. ఉమెన్‌ ఎంపవర్‌మెంట్‌ సెల్‌ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆర్ట్సు కళాశాలలో జరిగిన అవగాహన సదస్సులో ఆమె మాట్లాడుతూ  శారీరక పరిశుభ్రత ఆరోగ్యంలో ఎంతో కీలక పాత్ర వహిస్తుందన్నారు.ఈ కార్యక్రమానికి వైస్‌ ప్రిన్సిపాల్‌ రమేష్‌బాబు అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో పిఎంపి సంఘ నాయకులు బళ్ళా శ్రీనివాస్‌, మట్టా రమేష్‌, ఉమెన్‌ ఎంపవర్‌మెంట్‌ కన్వీనర్‌ పుష్పాంజలి, సెక్రటరీ డా.సుధామయి, డా.శ్రీవల్లీ, డా.నాగరాజేశ్వరి,  కృష్ణ, సూర్యకళ, డా.వసుధ, డా.గాయిత్రి, డా.జయశ్రీ, డా.రుద్ర, సునంద, సత్య, సరిత, సౌజన్య, డా.సునీత తదితరులు పాల్గొన్నారు.