సీటు ఇవ్వడం అధినేత ఇష్టం

0
343
ప్రజా సేవ కోసం రాజకీయాల్లోకి వచ్చా
టికెట్‌ ఇచ్చినా ఇవ్వకపోయినా శిరసావహిస్తా
జక్కంపూడి కుటుంబంతో విభేదాలు లేవు
మీట్‌ ది ప్రెస్‌ లో మాజీ ఎమ్యెల్యే రౌతు సూర్య ప్రకాశరావు
రాజమహేంద్రవరం, జూన్‌ 26 : ప్రజా సేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చానని, టిక్కెట్‌ కోసం రాజకీయాల్లో లేమని, టికెట్‌ ఎవరికివ్వాలో అధినేత ఇష్టమని,సీటు ఎవరికిచ్చినా పార్టీ నిర్ణయానికి కట్టుబడి పనిచేస్తానని రాజమహేంద్రవరం సిటీ మాజీ ఎమ్మెల్యే,  వైస్సార్‌ సిపి కో ఆర్డినేటర్‌ రౌతు సూర్య ప్రకాశరావు స్పష్టం చేసారు. దివంగత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర రెడ్డి ప్రోత్సాహంతో రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన దశాబ్దకాలం పాటు నగరానికి ఎన్నో అభివ ద్ధి కార్యక్రమాలు చేసే అద ష్టం కలిగిందని ఆయన చెప్పారు. అలాంటి వైఎస్‌ పేరిట ఏర్పడిన పార్టీలో చేరిన తాను గత నాలుగేళ్లుగా కో ఆర్డినేటర్‌ గా బాధ్యతలు నిర్వహిస్తున్నానని గుర్తుచేశారు. ది రాజమండ్రి ప్రెస్‌ క్లబ్‌ నిర్వహిస్తున్న మీట్‌ ది ప్రెస్‌ కార్యక్రమాల్లో భాగంగా ఈ ఉదయం నిర్వహించిన కార్యక్రమానికి రౌతు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ప్రెస్‌ క్లబ్‌ కార్యదర్శి జెవివి గణపతి స్వాగతం పలుకగా, అధ్యక్షులు కుడుపూడి పార్ధసారధి అధ్యక్షత వహించారు. రౌతుని సీనియర్‌ పాత్రికేయలు విఎస్‌ఎస్‌ క ష్ణకుమార్‌ పరిచయం చేసారు. ప్రెస్‌క్లబ్‌ గౌరవ అధ్యక్షులు మండేలా శ్రీరామ మూర్తి కూడా వేదికపై ఆశీనులయ్యారు.
 ”పుట్టింది రాజమండ్రి. విద్యాభ్యాసం పలు చోట్ల జరిగింది. ఎక్కడ చదివినా అక్కడ విద్యార్థి నేతగా ఎన్నికయ్యాను. హైస్కూల్‌ లో ఎస్‌ పిల్‌ నుంచి కాలేజీలో లీడర్‌ దాకా పనిచేసాను. మొదట్లో ఏ ఐ ఎస్‌ ఎఫ్‌ లో పనిచేసినా,ఆతర్వాత ఎన్‌ ఎస్‌ యు ఐ లో చేరాను. ఇక్కడే లా పూర్తిచేసిన నేను పలు స్వచ్ఛంద సంస్థలో పనిచేసాను. ముఖ్యంగా ఎపెక్స్‌ క్లబ్‌ వాటిలో పనిచేసాను. ఆంధ్రకేసరి యువజన సమితిలో అన్ని పదవులు చేశాను. సమితి అనుబంధ కళాశాల్లో కూడా పదవులు చేశాను. ఒకవిధంగా నాకు క్రెడిబిలిటీ ఏర్పడడానికి సమితి కారణం. పత్రిక రంగంలో మూడు తరాల వారితో అనుబంధం వుంది. స్వర్గీయ బత్తిన సుబ్బారావు రాజకీయాల్లో నాకు  స్ఫూర్తి. నిజాయితీగా ఉండాలని చెబుతూ అందుకనుగుణంగా పనిచేసిన మాజీ ఎమ్మెల్యే ఎసివై రెడ్డి,సమయం కాదు సమస్య ముఖ్యమని పోరాటం సాగించిన జక్కంపూడి రామమోహనరావు, ప్రజాప్రతినిధి అంటే ఇలా ఉండాలని నిరూపించిన మేధావి ఉండవల్లి అరుణకుమార్‌ ఇలా అందరి  స్పూర్తితో రాజకీయాల్లో రాణిస్తున్నాను. రెండు సార్లు ఎమ్మెల్యేగా సీటు వచ్చిందంటే ఎలాంటి పైరవీలు లేకుండా వచ్చింది. ఇక  వర్తక సంస్థ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ లో కార్యదర్శిగా, అధ్యక్షులుగా పనిచేసి టర్నోవర్‌  టాక్స్‌ పై ఆనాటి కాంగ్రెస్‌ ప్రభుత్వానికి  వ్యతిరేకంగా కూడా  పోరాటం చేసి సమస్య పరిష్కారానికి క షిచేసాం. నిబద్దత అంటే ఏమిటో నేర్చుకున్నాం”అని రౌతు వివరించారు. అఖిల పక్షం కన్వీనర్‌గా జీఎస్‌ బాలాజీదాస్‌,ముళ్ళపూడి సూర్యనారాయణ వంటి  పెద్దల సూచనలతో ఎన్నో సమస్యల పరిష్కారానికి క షి చేశా” అని ఆయన గుర్తు చేసుకున్నారు.
   ఎన్నో ఏళ్లుగా నగరానికి సమస్యగా ఉంటున్న ఐఎల్‌టిడి ఫ్లై ఓవర్‌ బ్రిడ్జి గానీ,జాంపేట రేల్వే వంతెన గానీ,గోదావరిపై నాలుగులైన్ల రోడ్డు బ్రిడ్జి గానీ సాధించానంటే,జక్కంపూడి, ఉండవల్లి అందించిన చేయూత,డాక్టర్‌ వైఎస్‌ అందించిన ప్రోత్సాహం కారణమని రౌతు చెప్పారు. పదిమందితో కలివిడిగా ఉండడం, పార్టీల బేధం చూడకుండా ఎవరు వచ్చినా పనిచేశామని,ముఖ్యంగా టిటిడి బోర్డు మెంబర్‌ గా కూడా పనిచేయడం వలన మంచి పేరు వచ్చిందని, ఈ విషయంలో తన శ్రీమతి సౌభాగ్యలక్ష్మి అందించిన సహకారం మరువలేనిదని, అందుకే ఇప్పటికీ టిటిడిలో తనకు మంచి పేరు కొనసాగుతోందని ఆయన అన్నారు. శ్రీవారి కళ్యాణం ఇక్కడ జరిపించడం,టిటిడి రెండవ కల్యాణ మండపం నిర్మాణం,కళాకేంద్రంలో శ్రీ వెంకటేశ్వర ఆలయం నిర్మాణం ఇలా ఎన్నో కార్యక్రమాలు చేయడంతో పాటు ప్రభుత్వం ద్వారా చేయలేని ఎన్నో పనులు టిటిడి ద్వారా చేయించే అద ష్టం లభించిందని ఆయన వివరించారు. అభివ ద్ధి విషయంలో ప్రజలకు ఉపయోగపడుతుందని తెలిస్తే, అనుమతి వున్నా లేకున్నా చేపట్టామని ఆయన చెబుతూ ఆర్యాపురంలో స్టోరేజ్‌ ట్యాంక్‌ పేరిట చెర్వు తవ్వకం ఒకటని ఆయన గుర్తుచేశారు.
  మీకు టికెట్‌ రాకుండా చేయడానికి మీ వ్యతిరేక వర్గం పట్టుబట్టి శివరామ సుబ్రహ్మణ్యంను పార్టీలోకి తీసుకొస్తోందన్న మాట వినిపిస్తోందని అడిగిన ప్రశ్నకు స్వాతంత్య్ర పోరాటం నుంచి వర్గాలు ఉన్నాయని,ఎవరి పని వారు చేసుకు వెళ్తారని, టికెట్‌ ఎవరికివ్వాలో అధినేత ఇష్టం మీద ఆధారపడి వుంటుందని రౌతు సమాధానం ఇచ్చారు. డాక్టర్‌ వైఎస్‌ను,జగన్‌ను చూసిన మీకు ఇద్దరిలో తేడా ఏమిటో గమనించారా అన్న ప్రశ్నకు డాక్టర్‌ వైఎస్‌ సుదీర్ఘ కాలం రాజకీయాల్లో ఉండి, 25ఏళ్ల తర్వాత సీఎం అయ్యారని,జగన్‌ విషయానికి వస్తే రాజకీయాలకు కొత్తయినప్పటికీ మొన్నటి ఎన్నికల్లో సొంతంగా 67సీట్లు తన రెక్కల కష్టం మీద గెలవడం మామూలు విషయం కాదని చెప్పారు. టిడిపి,పవన్‌,బిజెపి కలిస్తే ఒకటన్నర శాతం ఓట్లు తేడా వచ్చాయని ఆయన గుర్తుచేశారు. తనకు ఎవరితోనూ శత త్వం లేదని ఆయన చెబుతూ ఎన్నికల వరకే రాజకీయాలు ఆతర్వాత అభివ ద్ధే ప్రదానం అన్నట్లుగా పనిచేశామని ఆయన చెప్పారు. తనకు జక్కంపూడి కుటుంబంతో విభేదాలు లేవని కూడా ఆయన మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here