సీపిఐ భవిష్యద్ధర్శిని 

0
225
గోదావరి తీరాన రాష్ట్ర సమితి సమావేశాలు ఆరంభం
రాజమహేంద్రవరం,ఆగస్టు 11 : రాబోయే ఎన్నికల్లో పార్టీ శ్రేణులకు దిశా నిర్ధేశం చేసే లక్ష్యంతో భారత కమ్యూనిస్టు పార్టీ(సిపిఐ) రాష్ట్ర సమితి సమావేశాల నిర్వహణకు ఆ పార్టీ సన్నద్ధమయ్యింది. అందులో భాగంగా రివర్‌ బే ¬టల్లో ఈరోజు రాష్ట్ర సమితి సమావేశాలు ప్రారంభం అయ్యాయి. పార్టీ జాతీయ కార్యదర్శి డి.రాజా రాష్ట్ర సమితి సమావేశాలను ఈ ఉదయమే ప్రారంభించవలసి ఉండగా అనివార్య కారణాల వల్ల  మూడు గంటలకు సమావేశాలు ప్రారంభం అయ్యాయి. రాష్ట్ర నలుమూలల నుంచి సిపిఐ రాష్ట్ర సమితికి చెందిన సభ్యులు సకాలంలో హాజరుకావడంతో సమావేశాలు ప్రారంభం అయ్యేంత వరకూ పార్టీలోని అంతర్గత అంశాలపై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ పార్టీ శ్రేణులకు దిశా నిర్ధేశం చేశారు. పార్టీ నిర్మాణానికి సంబంధించి క్షేత్ర స్థాయిలో తీసుకోవాల్సిన అంశాలపై ఆయన వివరణ ఇచ్చారు. గత నాలుగున్నరేళ్ల కాలంలో పార్టీ చేపట్టిన కార్యక్రమాలు, పోరాటాలు, ప్రజల్లో పెరిగిన పరపతి వంటి అంశాలపై ఆయన వివరించారు. రాబోయే ఎన్నికల సందర్భంగా ఏవిధమైన నిర్ణయాలు తీసుకుంటే పార్టీకి, రాష్ట్రానికి ఏ మేరకు ఉపయోగం అనే అంశాలపైనా చర్చను చేపట్టారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ళ నాగేశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు రావుల వెంకయ్య, సత్యనారాయణ మూర్తి, జెల్లి విల్సన్‌, తూర్పు గోదావరి జిల్లా కార్యదర్శి తాటిపాక మధు, పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here