సుష్మా స్వరాజ్‌ మృతి దేశానికి తీరనిలోటు

0
142
రాజమహేంద్రవరం, ఆగస్టు 7 : కేంద్ర మాజీమంత్రి, బిజెపి సీనియర్‌ నాయకురాలు సుష్మా స్వరాజ్‌ హఠాన్మరణం దేశానికి తీరని లోటని ఆ పార్టీ నాయకులు క్షత్రియ బాలసుబ్రహ్మణ్యసింగ్‌, క్రొవ్విడి సురేష్‌కుమార్‌ అన్నారు. ఆయన మృతికి నివాళులర్పిస్తూ కోటగుమ్మం వద్ద కార్యక్రమం నిర్వహించారు. సింగ్‌, సురేష్‌లతోపాటు ఎన్‌.ఎస్‌.ఎస్‌.చంద్రశేఖర్‌, యియ్యపు మురళీధర్‌ తదితరులు సుష్మా స్వరాజ్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సింగ్‌ మాట్లాడుతూ 66 సంవత్సరాల జీవితంలో 48 సంవత్సరాలు ప్రజాసేవకై అంకితం చేసిన నాయకురాలు సుష్మా స్వరాజ్‌ అని కొనియాడారు. చిన్న వయసులోనే పదవులు చేపట్టి కేంద్ర స్థాయికి ఎదిగారన్నారు. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడంలో ఆమె చూపించే చొరవ మరువలేమన్నారు. ఈ కార్యక్రమంలో హీరాచంద్‌ జైన్‌, కారుమూరి గవర్రాజు, యర్రా శ్యామలరావు, భువన్‌, గుత్తుల సుదర్శనరావు, తంగుడు వెంకట్రావు, కారుమూరి సురేష్‌, సంజయ్‌, తులసి, పెదిరెడ్ల రాజేశ్వరి, జగదీష్‌, శేషగిరిరావు, రాయుడు వెంకటేశ్వరరావు, భతారిలాల్‌, తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here