సెయింట్‌పాల్స్‌ నూతన మందిరానికి శంకుస్ధాపన

0
146
శిలాఫలకం ఆవిష్కరించిన ఎఇఎల్‌సి మోడిరేటర్‌ పరదేశిబాబు
రాజమహేంద్రవరం, డిసెంబర్‌ 13 : స్థానిక జాంపేట సెయింట్‌పాల్స్‌ లూథరన్‌ చర్చ్‌ నూతన మందిర నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా జరిగింది.  ముఖ్య అతిథిగా ఎఇఎల్‌సి మోడిరేటర్‌ బిషప్‌ రెవరెండ్‌ డాక్టర్‌ కెఎఫ్‌ పరదేశిబాబు హాజరై శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఆయనకు పేరిస్‌ పాస్టర్‌ రెవరెండ్‌ టి.ఆదామ్‌, అడిషినల్‌ పేరిస్‌ పాస్టర్‌ ఈ.బాపనయ్య తదితరులు ఘనంగా స్వాగతం పలికారు. ముందుగా చర్చి ఆవరణలో ఉన్న మిషనరీ ఆఫ్‌ గోదావరి సినడ్స్‌ వ్యవస్థాపకుడు లూయిస్‌ పి.మెంటో కాంట్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం చర్చి వెనుక ప్రాంతంలో శిలాఫలకాన్ని ఆవిష్కరించి ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చర్చి నిర్మాణం త్వరితగతిన పూర్తయ్యేలా ఆ యేసుక్రీస్తు ఆశీర్వదిస్తాడన్నారు. సంఘ సభ్యులందరూ సమైక్యతతో చర్చి నిర్మాణంలో పాలు పంచుకోవాలని సూచించారు. యేసుక్రీస్తు కృపా, దైవబలం వల్ల సత్వరం చర్చి పూర్తవుతుందని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమానికి సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. యేసు ప్రభువు నామాన్ని సదా స్మరించడం ద్వారా క్రైస్తవులకు అన్ని విధాలా మేలు జరుగుతుందని క్రిస్మస్‌ సందర్భంగా విస్తృతంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ అందరూ ఆనందంగా గడపాలని సూచించారు. ప్రభువు సందేశాన్ని అందించి సమాజంలో అందరూ సుఖ సంతోషాలతో గడిపేలా సహకరించాలని పిలుపునిచ్చారు. యేసురాజుకి జై, సెయింట్‌ పాల్స్‌ సంఘ సభ్యుల ఐక్యత వర్థిల్లాలి అంటూ పెద్దఎత్తున నినదించారు. ఈ కార్యక్రమానికి  ముఖ్య అతిథిలుగా తూర్పు గోదావరి సినడ్‌ బిషప్‌ కె.జేసుదాస్‌, ఎఇఎల్‌సి ట్రెజరర్‌ కె.ఆర్నాల్డ్‌ మోజెస్‌, తూర్పు గోదావరి సినడ్‌ రెవరెండ్‌ ఎన్‌.అశోక్‌కుమార్‌ తదితరులు హాజరయ్యారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సిటీ కో ఆర్డినేటర్‌ శ్రీఘాకోళ్లపు శివరామసుబ్రహ్మణ్యం,మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు,మాజీ ఫ్లోర్‌ లీడర్‌ మేడపాటి షర్మిలారెడ్డి, జాంపేట కో ఆపరేటివ్‌ బ్యాంక్‌ చైర్మన్‌ బొమ్మన రాజ్‌కుమార్‌, వైసిపి నాయకులు బాబిరెడ్డి, ఉప్పాడ కోటరెడ్డి, కాటం రజనీకాంత్‌, ఆముదాల పెదబాబు, అడపా రాజు, టీడీపీ నాయకులు రెడ్డి రాజు, కాంగ్రెస్‌ నాయకుడు కాటం రవి, స్థానిక పెద్దలు చాపల చినరాజు, వెంట్రపాటి వీర్రాజు, దొండపాటి కృష్టాఫర్‌ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here