సేవలు మరింత విస్తృతం కావాలి

0
596
లయన్స్‌ క్లబ్‌ రాజమహేంద్రవరం అధ్యక్షుడిగా తుమ్మిడి బాబ్జి ప్రమాణ స్వీకారం
రాజమహేంద్రవరం, జులై 1 : లయన్స్‌ క్లబ్‌ సేవలు ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా జరుగుతున్నాయని, ఇప్పుడు బాధ్యతలు స్వీకరిస్తున్న నూతన కార్యవర్గం మరింత ఉత్సాహంతో సేవలు కొనసాగించాలని రాష్ట్ర బీసీ కార్పొరేషన్‌ వైస్‌ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ బి.రామారావు సూచించారు. లయన్స్‌ క్లబ్‌ ఆఫ్‌ రాజమహేంద్రవరం 56వ అధ్యక్షునిగా ప్రముఖ వస్త్ర వ్యాపారి, స్వర్ణాంధ్ర సేవా సంస్థ గౌరవాధ్యక్షులు లయన్‌ తుమ్మిడి అరుణ్‌కుమార్‌ (బాబ్జి) ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. మోరంపూడి సెంటర్‌లోని శ్రీనగర్‌లో ఉన్న ఎలక్ట్రికల్‌ ఇంజనీర్స్‌ అసోసియేషన్‌ హాలులో ఈ కార్యక్రమం జరిగింది. ముఖ్యఅతిధిగా బి.రామారావు పాల్గొని నూతన కార్యవర్గానికి అభినందనలు తెలిపారు. వస్త్ర వ్యాపారులుగా, సమాజ సేవకులుగా పేరొందిన తుమ్మిడి అరుణ్‌కుమార్‌ నగర అధ్యక్షునిగా క్లబ్‌కు వన్నె తెస్తారని అన్నారు. అధ్యక్షునిగా అరుణకుమార్‌, కార్యదర్శిగా పి.కె.వి.కృష్ణారావు, కోశాధికారిగా ఎస్‌.బాపిరాజు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్‌ ప్రముఖులు గ్రంథి వెంకటేశ్వరరావు, ఎస్‌.వి.వి.సత్యనారాయణ, జోన్‌ చైర్‌పర్సన్‌ డాక్టర్‌ గుబ్బల రాంబాబు, కరుణకుమార్‌, కొత్త బాలమురళీకృష్ణ, తుమ్మిడి రామ్‌కుమార్‌ తదితరులు పాల్గొని నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here