సేవారంగంలో యువత ముందుండాలి

0
544
రక్తదాన శిబిరం ప్రారంభంలో ఎమ్మెల్యే ఆకుల
రాజమహేంద్రవరం, అక్టోబర్‌ 2: నేటి యువతరం సేవా రంగంలో ముందుండాలని సిటీ ఎమ్మెల్యే డా.ఆకుల సత్యనారాయణ అన్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌ సంస్ధకు అనుబంధంగా ఉన్న సేవా భారతి ప్రతినిధి,  రాజమహేంద్రవరం ¬టల్స్‌ అసోషియేషన్‌ అధ్యక్షులు కోసూరి సుబ్బరాజు తనయుడు కోసూరి తేజ వంశీ వర్మ ఆధ్వర్యంలో గాంధీ జయంతిని పురస్కరించుకుని ఏవీ అప్పారావు రోడ్డులోని  క్షత్రియ కళ్యాణ మండపంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ముఖ్య అతిధిగా పాల్గొన్న ఎమ్మెల్యే ఆకుల రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. మహత్ముని జయంతినాడు రక్తదాన శిబిరాన్ని నిర్వహించిన వంశీ వర్మను అభినందించారు. ఆర్‌ఎస్‌ఎస్‌ సంస్థకు అనుబంధంగా ఉన్న సేవా భారతి దేశ వ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలు తలపెడుతుందన్నారు. మరో అతిధి, గ్రంథాలయ సంస్ధ మాజీ చైర్మన్‌ బైర్రాజు ప్రసాదరాజు మాట్లాడుతూ ఉద్యోగం, వ్యాపారాలకే పరిమితం కాకుండా సేవా కార్యక్రమాల వైపు అడుగుపెట్టిన వంశీ వర్మను అభినందించి భవిష్యత్తులో మరిన్ని మంచి కార్యక్రమాలు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ¬టల్స్‌ అసోషియేషన్‌ కార్యదర్శి కోటిపల్లి ప్రసాద్‌, సేవా భారతి ప్రతినిధి లక్ష్మణ్‌ తదితరులు పాల్గొన్నారు.