సేవా కార్యక్రమాలే లక్ష్యంగా రేపు గన్ని కృష్ణ జన్మదిన వేడుకలు

0
220
రాజమహేంద్రవరం, నవంబర్‌ 21: గుడా చైర్మన్‌ గన్ని కృష్ణ పుట్టినరోజు సందర్భంగా రేపు నగరంలో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు గన్ని కృష్ణ మిత్ర        బృందం ఒక ప్రకటనలో పేర్కొంది. నిరాడంబరంగా, సేవా కార్యక్రమాలే లక్ష్యంగా వేడుకలు జరుగుతాయన్నారు. రేపు ఉదయం 8:30 గంటలకు లాలాచెరువులోని స్వర్ణాంధ్ర వృధ్దాశ్రంలో వృద్దులతో కలిసి గన్ని కృష్ణ అల్పాహారం స్వీకరిస్తారని అన్నారు. ఉదయం 9:30 గంటల నుండి 10:30 గంటల వరకు 42వ డివిజన్లో నూతనంగా నిర్మించిన వినాయక ఆలయాన్ని ప్రారంభిస్తారు. అనంతరం మునిసిపల్‌ కాలనీ కమ్యూనిటీ హాల్‌పై గుడా నిధులతో నిర్మించనున్న  మొదటి అంతస్తు పనులకు శ్రీకారం చుడతారు.ఆ తరువాత కాళీ స్పెషల్‌ మునిసిపల్‌ పాఠశాలలో విద్యార్థులకు పెన్నులు, అట్టలు పంపిణీ చేస్తారు. ఉదయం 10:30 గంటలకు ప్రభుత్వ ఆసుపత్రిలో   జరిగే రక్తదాన శిబిరంలో పాల్గొంటారు. ఉదయం 11:30 గంటలకు లాలాచెరువు రోడ్డులో ఉన్న గౌతమీ జీవకారుణ్య సంఘంలో వృధ్దుల ఆశ్రమంలో గుడా నిధులతో నిర్మించనున్న టాయిలెట్స్‌ పనులను ప్రారంభిస్తారు. అనంతరం వ ధ్దులకు చీరలు, పండ్లు పంపిణీ చేస్తారు. మధ్యాహ్నం 12:30 గంటలకు ప్రియదర్శిని చెవిటి, మూగ ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులకు అన్నదానం చేస్తారు. 12:45 గంటలకు లలితానగర్‌లో జరిగే అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 1:00 గంటకు గోదావరి గట్టున ఉన్న గౌతమీ జీవకారుణ్య సంఘంలో చిన్నారులతో కలిసి గన్ని కృష్ణ కుటుంబ సభ్యులు, సహచరులు భోజనాలు చేస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు గన్ని కృష్ణ దత్తత తీసుకున్న ఏజెన్సీ గ్రామమైన ఫజుల్లాబాద్‌లో గన్ని కృష్ణ స్వంత నిధులతో నిర్మించనున్న ఎలిమెంటరీ పాఠశాల భవన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. అనంతరం పాఠశాల విద్యార్థులకు స్కూల్‌ బ్యాగ్స్‌, పండ్లు పంపిణీ చేస్తారు. పుట్టినరోజు సందర్భంగా ఫ్లెక్సీలు, దండలు, బొకేలు తీసుకురావద్దని, డివిజన్ల వారీగా అందిస్తున్న మొక్కలు నాటి, ఆ ఫొటోలను సోషల్‌ మీడియాలో పోస్టు చేసి శుభాకాంక్షలు తెలపాలని సూచించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here