సేవా కార్యక్రమాల నడుమ నాగేశ్వర్‌ పుట్టిన రోజు వేడుకలు

0
115
రాజమహేంద్రవరం,నవంబర్‌ 9: రాజమహేంద్రవరం రూరల్‌ మాజీ ఎమ్మెల్యే, చందన సంస్థల అధినేత చందన రమేష్‌ తనయుడు చందన నాగేశ్వర్‌ (పింటుబాబు) 35వ జన్మదినోత్సవ వేడుకలు నగరంలో ఘనంగా జరిగాయి. సేవల్లో తమ కుటుంబానికి ఎవరూ సాటి లేరన్నట్టుగా నాగేశ్వర్‌ కూడా అదే బాటలో పయనిస్తూ వస్త్ర, స్వర్ణాభరణాల వ్యాపారంలో రాటు దేలుతూ.. సేవా కార్యక్రమాలను కూడా అదే స్ఫూర్తితో నిర్వహిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. చందన సంస్థల సిబ్బంది ఆధ్వర్యంలో ధవళేశ్వరం పలుకు చెవిటి, మూగ పిల్లల ఆశ్రమానికి 2 పెద్ద మిల్టాన్‌ ఫ్లాస్కులు, పిల్లందరికీ పండ్లు పంపిణీ చేసారు. పలుకు పాఠశాల నిర్వాహకులు సత్యనారాయణ మాజీ ఎమ్మెల్యే చందన రమేష్‌ తనయుడు చందన నాగేశ్వర్‌ సేవలను కొనియాడారు. స్థానిక సెంట్రల్‌ జైల్‌రోడ్‌లో ఉన్న జీవకారుణ్యసంఘంలో వృద్ధులకు పండ్లు పంపిణీ చేసారు. అనంతరం స్థానిక కోటగుమ్మం వద్ద నున్న చందన జ్యూయలర్స్‌ వద్ద పేదలు, అనాధలు, వృద్ధులకు భోజనం ప్యాకెట్లు అందచేసారు. చందనలో కేక్‌ కట్‌ చేసి అందరితో ఆనందంగా గడిపారు. ఈ సందర్భంగా చందన నాగేశ్వర్‌ మాట్లాడుతూ సమాజంలో అట్టడుగున ఉన్నవారికి ప్రతీ ఒక్కరు తమవంతుగా తమసహాయ సహాకారాలు అందించాలని కోరారు. ప్రతీ ఏటా తన పుట్టిన రోజు సందర్భంగా వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. స్థానిక తాడితోట జంక్షన్‌లో ఉన్న ప్రభుత్వ పాఠశాలను దత్తత తీసుకుని విద్యార్థులకు అవసరమైన మౌళిక సదుపాయాల కల్పనకు కృషిచేస్తున్నామన్నారు. తన తండ్రి చందన రమేష్‌ ఎమ్మెల్యేగా పనిచేసిన సమయంలో ప్రతీ నెలా ప్రభుత్వం ఇచ్చే జీతాన్ని కూడా పేదలు, వృద్ధులు, వికలాంగులకు పింఛన్లుగా పంపిణీ చేసారన్నారు. అదే స్ఫూర్తితో తాను కూడా నిరంతరం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ చందన సంస్థల పేరు ప్రఖ్యాతులను ఇనుమడింప చేసేందుకు కృషిచేస్తున్నానని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో చందన పలు విభాగాలకు చెందిన మల్లిబాబు, డి.సుధాకర్‌, ఎ.జగదీశ్వరరావు, మహ్మద్‌ అలీ, ఎం.గున్నేశ్వరరావు, నూర్‌ భాషా సేవా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్‌ చాన్‌భాషా, చందన సంస్థల సిబ్బంది పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here