సేవా కార్యక్రమాల నడుమ మజ్జి రాంబాబు జన్మదిన వేడుకలు

0
179
ప్రియదర్శినిలో వృద్ధులకు చీరలు పంపిణీ
రాజమహేంద్రవరం,ఫిబ్రవరి 5 : తెలుగుదేశం పార్టీ నాయకులు మజ్జి రాంబాబు జన్మదిన వేడుకలు సేవా కార్యక్రమాల నడుమ ఘనంగా జరిగాయి. గుడా ప్రథమ చైర్మన్‌ గన్ని కృష్ణ, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, శాప్‌ మాజీ డైరెక్టర్‌ యర్రా వేణుగోపాలరాయుడు, యువ నాయకులు ఆదిరెడ్డి వాసు పాల్గొని ప్రియదర్శిని చెవిటి,మూగ ఆశ్రమ పాఠశాలలో ఉన్న విద్యార్ధులకు,వృధ్దులకు అన్నదానం చేశారు. వృద్ధులు, పార్టీ నాయకుల మధ్య రాంబాబు కేక్‌ కట్‌ చేశారు.ఈ సందర్భంగా వృద్ధులకు చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మళ్ళ వెంకట్రాజు, పితాని కుటుంబరావు, తంగెళ్ళ బాబీ, కరగాని వేణు, మజ్జి సోమేశ్వరరావు, బిసి సంక్షేమ సంఘం మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు మజ్జి సత్యవేణి, సీతా త్రినాధ్‌, పోసుపో శేఖర్‌, నానిపల్లి అప్పారావు, ప్రభు, కొసలు మధు, మురళి, బర్ల ప్రసాద్‌, ఆళ్ళ బుజ్జి, చనపతి సత్తిబాబు,అప్పన సత్తిబాబు, నాగభూషణం,పీతా చిన్ని, వానపల్లి శ్రీనివాసరావు, టివి రాము,నాయుడు మాస్టర్‌,బలగం అప్పారావు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here