సేవా కార్యక్రమాల నడుమ మాటూరి సిద్దార్ద జన్మదిన వేడుకలు

0
126
రాజమహేంద్రవరం, డిసెంబర్‌ 27 : నగరాన్ని స్వచ్చంగా, సుందరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్న రాజమండ్రి రైజింగ్‌ అడ్మిన్‌ మాటూరి  సిద్దార్ద పుట్టినరోజు సందర్భంగా ఈరోజు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ముందుగా 22వ డివిజన్‌లోని సదనం స్కూల్‌  విద్యార్థులకు, కంచాలు,దుప్పట్లు అందజేసి వారికి అల్ఫాహారం ఏర్పాటు చేశారు. పాఠశాల ఆవరణలో పూలమొక్కలు, పండ్ల మొక్కలు నాటి,పారిశుధ్య కార్మికులకు దుప్పట్లు, పండ్లు పంపిణీ చేసారు.అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో సిద్దార్ధతో పాటు వారి బృందం రక్తదానం చేసారు. మాటూరి సేవలకు పలువురు అభినందనలు తెలియజేశారు. సిద్దార్ద తండ్రి కార్పొరేటర్‌ మాటూరి రంగారావు, తల్లి లయన్స్‌ మాటూరి మంగతాయారు, సిద్ది వినాయక దేవస్థానం కమిటీ ఛైర్మన్‌ శెట్టి జగదీష్‌, మద్ది నారాయణరావు,మండవిల్లి హరనాధ్‌, నాళం చలపతి, సదనం వార్డన్‌ శకుంతల కుమారి, లయన్స్‌ క్లబ్‌ సంస్క తి అధ్యక్షుడు గంగాధరరావు, కార్యదర్శి నాళం శివరాం, గోపాలక ష్ణ, పూర్ణ, గోపి, అప్పన నాగమణి, త్రక్కశిల మంజు(సునీత) రాజేశ్వరి, భాగ్యలక్ష్మి, పైడారవి, సుభాష్‌, గుప్త తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here