సైకాలజిస్టుల జాతీయ అధ్యక్షుడిగా కమలాకర్‌

0
153
తక్షణం కౌన్సిల్‌కై హిప్నో కమలాకర్‌  డిమాండ్‌
రాజమహేంద్రవరం, మే 17 : ప్రోగ్రెసివ్‌ సైకాలజిస్టుల అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా జాతీయ అధ్యక్షుడు డాక్టర్‌ హిప్నో కమలాకర్‌, మహిళా విభాగం అధ్యక్షురాలిగా డాక్టర్‌ హిప్నో పద్మాకమలాకర్‌ మూడోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈనెల 11, 12 తేదీల్లో విజయవాడలో జరిగిన సైకాలజిస్టుల రెండ్రోజుల జాతీయ మహాసభలు విజయవంతమయ్యాయని కమలాకర్‌ అన్నారు. స్థానిక దానవాయిపేటలో ఉన్న ఆయన కార్యాలయంలో ఈరోజు జరిగిన విలేకరుల సమావేశంలో మహాసభల వివరాలను వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణా, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఒరిస్సా రాష్ట్రాల నుంచి 150 మందికి పైగా కౌన్సిలింగ్‌ సైకాలజిస్టులు మహాసభలో పాల్గొన్నారన్నారు. ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ పూర్వ జాతీయ అధ్యక్షుడు డాక్టర్‌ జి.సమరం జ్యోతి ప్రజ్వలన చేసి సభలను ప్రారంభించి మూడు గంటల పాటు వృత్తి నైపుణ్యాలతపై సైకాలజిస్టులకు శిక్షణ ఇచ్చారన్నారు. విజయవాడ సిద్ధార్ధ వైద్య విద్యాలయం మానసిక వైద్య విభాగ ప్రొఫెసర్‌ డాక్టర్‌ వి.రాధికారెడ్డి మహిళలు తల్లిగా, భార్యగా, కుటుంబ నిర్వహణలో వత్తిడికి గురికావడం వల్ల ఎదురయ్యే మానసిక సమస్యల పరిష్కార విధానాలపై శిక్షణ ఇచ్చారన్నారు. సైకాలజిస్టులకు వృత్తిపరమైన భద్రత కల్పించేందుకు సైకాలజిస్టుల కౌన్సిల్‌ ఏర్పాటు చేయాలని, సైకాలజీ కోర్సులను పునర్‌వ్యవస్థీకరణ చేసి ఇంటర్‌ తరువాత ఐదేళ్ల వృత్తి విద్యా కోర్సుగా రూపకల్పన చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసారు. అన్ని ప్రభుత్వ, కార్పొరేట్‌ పాఠశాలల్లో, కళాశాలల్లో కౌన్సిలింగ్‌ సైకాలజిస్టులను నియమించేందుకు జిఓ 19ని తక్షణం అమలు చేయాలని డిమాండ్‌ చేసారు. సైకాలజిస్టుల ఆంధ్రప్రదేశ్‌ అధ్యక్షుడిగా డాక్టర్‌ వింజరపు జనార్ధనం, తెలంగాణా అధ్యక్షుడిగా జి.వీరభద్రం, సైకాలజీ విద్యార్ధి విభాగ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అధ్యక్షుడిగా పేరుబోయిన రమేష్‌కుమార్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని వివరించారు. జిఓ 19 అమలుకై ఉద్యమ కార్యాచరణ చేస్తున్నామని త్వరలో పోరాటం ప్రారంభిస్తామని కమలాకర్‌ తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here