సైనిక సంక్షేమానికి చేయి చేయి కలుపుదాం

0
312
sainika-sankshemam
ఆర్మీ వెల్ఫేర్‌ ఫండ్‌కు ఆదిరెడ్డి వాసు విరాళం
రాజమహేంద్రవరం, సెప్టెంబర్‌ 21 : దేశ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండటానికి ప్రధాన కారణం దేశ సరిహద్దుల్లో  భద్రతా సిబ్బంది ప్రాణాలు ఎదురొడ్డి పోరాడటమేనని తెలుగుదేశం పార్టీ యువ నాయకులు ఆదిరెడ్డి వాసు అన్నారు. ఈరోజు ప్రెస్‌క్లబ్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ భారతదేశంలో విదేశీ కంపెనీలు పెట్టుబడులు పెడుతున్న నేపథ్యంలో పాక్‌ ఉగ్రవాదులు ఓర్వలేక యూరీలో సైనిక స్థావరంపై దాడులకు పాల్పడ్డారని, ఈ ఘటనలో మృతి చెందిన వీర జవాన్ల ఆత్మకు శాంతి కలగాలని ప్రార్ధిస్తున్నామన్నారు. దేశ సరిహద్దుల్లో పోరాడుతున్న సైనికుల కుటుంబాలకు భరోసా కల్పించే కార్యక్రమంలో ప్రజలంతా భాగస్వామ్యం కావాలని, ఆర్మీ వెల్ఫేర్‌ ఫండ్‌కు రోజుకి రూపాయి చొప్పున దేశ ప్రజలు కేటాయిస్తే ఏడాదికి రూ.36వేల కోట్లు అవుతుందన్నారు. ముందుగా తన కుటుంబం నుంచి ఆర్మీ వెల్ఫేర్‌ ఫండ్‌కు ఏడాదిపాటు నెలకు రూ.7,500 చొప్పున విరాళమందిస్తామని ప్రకటించారు. దేశ ప్రజలు సైనిక సంక్షేమానికి ముందుకు వస్తే సైనికుల్లో ఆత్మస్థైర్యం మరింత పెంపొందుతుందన్నారు. ఈ విలేకరుల సమావేశంలో మేరపురెడ్డి రామకృష్ణ, బుడ్డిగ రవి, కొల్లి బుజ్జి, కర్రి రాంబాబు, బిల్డర్‌ చిన్న, ఆవాల ఈశ్వర్‌, సీరెడ్డి బాబి, పొదిలాపు నాగేంద్ర, కొండేటి సుధాకర్‌, రవి, చరణ్‌, మెరపల శివ, లచ్చిరెడ్డి వాసు, గొర్రెల రమణ, మట్టా శివ, దుర్గ, వంశీ, ఎస్‌.కె.మీరా, సుదర్శన్‌ తదితరులు పాల్గొన్నారు.