సొంతింటిని అమ్ముకోవద్దు

0
263
45 వ డివిజన్‌లో పట్టాల పంపిణీలో ప్రజాప్రతినిధులు
రాజమహేంద్రవరం, నవంబర్‌ 8 : పేద ప్రజల సొంతింటి కలను ప్రభుత్వం నెరవేరుస్తుందని, అయితే లబ్ధిదారులు ఇల్లును అమ్ముకోవద్దని పలువురు ప్రజాప్రతినిధులు సూచించారు.స్ధానిక 45 వ డివిజన్‌లోని రోడ్లు,భవనాల శాఖ స్థలంలో నిర్మిస్తున్న 96 గృహాలకు సంబంధించిన లబ్ధిదారులకు ఈరోజు పట్టాలు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో సిటీ, రూరల్‌ ఎమ్మెల్యేలు ఆకుల సత్యనారాయణ, గోరంట్ల బుచ్చయ్యచౌదరి, గుడా చైర్మన్‌, మేయర్‌ పంతం రజనీ శేషసాయి, స్ధానిక కార్పొరేటర్‌ తాడి మరియ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికీ గృహాలను మంజూరు చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని, అందులో భాగంగా స్ధల సేకరణ కార్యక్రమాన్ని వేగవంతం చేశామన్నారు. నగరంలో సుమారు 22 వేల మంది గృహాల కోసం దరఖాస్తు చేశారని, దానిని దృష్టిలో పెట్టుకుని తొలుత  పది వేల గృహాలను నిర్మిస్తున్నామన్నారు. ఒకసారి ప్రభుత్వ గృహాన్ని పొందిన వారు తిరిగి పొందే అవకాశం లేకుండా ఆధార్‌ కార్డును అనుసంధానం చేస్తున్నామన్నారు. దేశ వ్యాప్తంగా 60 లక్షల గృహాలను నిర్మిస్తుండగా ఆంధ్రప్రదేశ్‌లో 14 లక్షల గృహాలను నిర్మిస్తున్నారని తెలిపారు. పేద ప్రజలకు నాణ్యతతో కూడిన గృహాలను అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు కొయ్యల రమణ, కురగంటి సతీష్‌, బిజెపి నాయకులు క్షత్రియ బాలసుబ్రహ్మణ్య సింగ్‌, చింతల లాల్‌బహుదుర్‌ శాస్త్రి తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here