సొంతింటి కల సాకారానికి అవగాహన

0
284
క్రెడై హొమ్‌ ఎక్స్‌పోకు విశేష స్పందన
రాజహేంద్రవరం, ఆగస్టు 24 : కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా(క్రెడై) రాజమహేంద్రవరం చాప్టర్‌ ఆధ్వర్యంలో స్ధానిక చెరుకూరి కళ్యాణమండపంలో మూడు రోజుల పాటు నిర్వహిస్తున్న హొమ్‌ ఎక్స్‌పో 2019కి విశేష స్పందన లభిస్తుంది. గృహాలు, ప్లాట్‌లు, అపార్టుమెంట్‌లు కొనులో చేయాలనుకొనే వారు, గృహాల నిర్మిచాలనుకొనే వారికి పూర్తిస్ధాయిలో అవగాహన కల్పించే విధంగా క్రెడై హొమ్‌ ఎక్స్‌పోను ఏర్పాటుచేసింది.  రెండువ రోజు శనివారం పెద్దఎత్తున ఎక్స్‌పోను తిలకించారు. రియల్‌ ఎస్టేట్‌ సంస్ధలు, గృహ నిర్మాణానికి వినియోగించే వస్తువులకు సంబంధించి తయారీ సంస్ధలు, ఇంటీరియర్‌, పర్నిచర్‌, లిప్ట్‌లు తయారీ సంస్ధ, హొమ్‌ ధియేటర్‌ సంస్ధలు తమ స్టాల్స్‌ను ఏర్పాటు చేసి వినియోగదారులకు అవగాహన కల్పిస్తున్నారు. ఇంటి నిర్మాణంతో పాటు ఇంటికి ఏయే హంగులు దిద్దుకోవాలి, ఎంత సౌకర్యవంతంగా గృహాన్ని తీర్చిదిద్దుకోవచ్చును అనే అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు. సొంతిటిని కొనుగోలు చేయాలనుకొనే వారికి, నిర్మించుకొనే వారికి బ్యాంకర్‌లు కూడా అవసరమైన సూచనలు, సలహాలు అందజేస్తున్నారు. గృహాలుపై రుణం ఎలా పొందవచ్చును, వడ్డి రేట్లు తదితర అంశాలను వినియోగదారులకు అవగాహన కల్పిస్తున్నారు. ఎస్‌బిఐ, ఎల్‌ఐసి హొం లోన్స్‌ వంటి సంస్ధల నుండి ప్రతినిధులు హాజరయి తమ బ్యాంక్‌లు అందిస్తున్న రుణాలు, వడ్డీల శాతాన్ని తెలియజేస్తున్నారు. వివిధ రియల్‌ ఎస్టేట్‌ సంస్ధలు రాజమహేంద్రవరం చుట్ట ప్రక్కల ప్రారంభిస్తున్న వెంచర్‌ల గురించి వివరిస్తున్నారు. క్రెడై హొమ్‌ ఎక్స్‌పోకు హాజరయ్యే వారితో కూపన్‌లు నింపి, ప్రతి గంటలకు లక్కీ డిప్‌ నిర్వహించి, బహుమతులు అందజేస్తున్నారు.మూడు రోజులకు కలిపి ఆదివారం బంపర్‌ డ్రా నిర్వహిస్తారు. రూరల్‌ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్యచౌదరి క్రెడై హొం ఎక్స్‌పోను తిలకించి నిర్వాహకులను అభినందించారు.  క్రెడై రాష్ట్ర సలహా కమిటీ అధ్యక్షులు బుడ్డిగ శ్రీనివాస్‌, క్రెడై రాజమహేంద్రవరం చాప్టర్‌ ఛైర్మన్‌ నందెపు శ్రీనివాస్‌, అధ్యక్షులు సూరవరపు శ్రీనివాసకుమార్‌, ఇతర ప్రతినిధులు  మన్యం ఫణికుమార్‌, కర్రి సోమశేఖర్‌రెడ్డి, వేలుమూరి భీమశంకర్‌ రావు, పూడి వెంకట శ్రీనివాసరావు, రెడ్డి రామకృష్ణ, జివివి సుబ్రహ్మణ్యం, ఆకుల రమేష్‌, చిట్టిబాబు, ప్రసాద్‌, మోహన్‌రావు, ఆకార్‌ నరిసింహారావు, వెంకటేష్‌లు ఏర్పాట్లును పర్యవేక్షిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here