స్టాండింగ్‌ కమిటీ సభ్యులుగా ఐదుగురు కార్పొరేటర్లు ఎన్నిక

0
223
రాజమహేంద్రవరం, అక్టోబర్‌ 11 : రాజమహేంద్రవరం నగర పాలక మండలి స్టాండింగ్‌ కమిటీ సభ్యులుగా కార్పొరేటర్లు గొందేశి మాధవి లత (19 వ డివిజన్‌), కొమ్మ శ్రీనివాస్‌ (21 వ డివిజన్‌), బెజవాడ రాజ్‌కుమార్‌ (24 వ డివిజన్‌), కార్పొరేటర్‌ కరగాని మాధవి (35 వ డివిజన్‌), తంగెళ్ళ బాబి (36)  ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఏడాది  కాలపరిమితి గల ఈ పదవులకు ఇటీవల నోటిఫికేషన్‌ జారీ చేసి ఎన్నికల ప్రక్రియ నిర్వహించారు. నగర పాలక మండలిలో స్పష్టమైన ఆధిక్యం కలిగిన తెలుగుదేశం పార్టీ ఈ ఏడాది వీరికి అవకాశం కల్పించింది. స్టాండింగ్‌ కమిటీలో మొత్తం ఐదుగురు సభ్యులకు గాను పోటీలో ఐదుగురే ఉండటంతో వీరంతా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు కౌన్సిల్‌ కార్యదర్శి జి. శైలజావల్లి ప్రకటించారు. వీరంతా నగర పాలక మండలికి తొలిసారి ఎన్నికైన వారే కావడం విశేషం. కాగా కొత్తగా ఎన్నికైన వారిని నగర మేయర్‌ పంతం రజనీ శేషసాయి తదితరులు అభినందించారు. నగర అభివృద్ధికి, ప్రజా సౌకర్యం కోసం చేపట్టే పనులకు సంబంధించి అవసరమైన ప్రతిపాదనలు రూపొందించి వాటిని ఆమోదించడంతో పాటు సక్రమంగా అమలయ్యేలా స్టాండింగ్‌ కమిటీ సభ్యులు సమిష్టిగా సహకరించాలని మేయర్‌ కోరారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here