స్థానికులకు అన్యాయం చేస్తే ఊరుకోం

0
132
అంగన్‌వాడీ టీచర్‌ పోస్టుల భర్తీపై ఆదిరెడ్డి
రాజమహేంద్రవరం, నవంబర్‌ 7 : అంగన్‌వాడీ టీచర్‌ పోస్టింగ్‌ విషయంలో స్థానిక మహిళకు అన్యాయం చేస్తే చూస్తూ ఊరుకోబోమని మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, తెలుగుదేశం పార్టీ యువ నాయకులు ఆదిరెడ్డి శ్రీనివాస్‌ (వాసు)లు అన్నారు. స్థానిక 13వ డివిజన్‌ అంబేద్కర్‌నగర్‌-1 అంగన్‌ వాడీ సెంటర్‌ టీచర్‌ పోస్టు ఖాళీ అవ్వడంతో ఆ స్థానాన్ని 28వ డివిజన్‌కు చెందిన మహిళతో భర్తీ చేసేందుకు ఐసీడీఎస్‌ అధికారులు అన్ని ఏర్పాట్లు చేసి ఆర్డర్‌ కోసం జిల్లా కలెక్టర్‌కు నివేదికలు పంపించారు. అయితే అదే అంగన్‌ వాడీ సెంటర్‌లో ఆయాగా విధులు నిర్వహిస్తున్న స్థానికురాలినైన… విద్యా వంతురాలినైన తనకు కాకుండా 28వ డివిజన్‌కు చెందిన మహిళకు ఎలా ఇస్తారని, తనకు న్యాయం చేయాలన్న విజయగౌరి అభ్యర్ధన మేరకు ఆదిరెడ్డి అప్పారావు, ఆదిరెడ్డి శ్రీనివాస్‌లు ఈరోజు ఐసీడీఎస్‌ సీడీపీఓను కలిసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. స్థానిక మహిళకు కాకుండా వేరే డివిజన్‌కు చెందిన మహిళతో ఎలా భర్తీ చేస్తారని నిలదీసారు. అంగన్‌ వాడీ కేంద్రాల్లో పోస్టులను స్థానిక మహిళలతోనే భర్తీ చేయాలని జీఓ ఉన్నా దానిని ఎలా ఉల్లంఘిస్తారని ప్రశ్నించారు. విజయగౌరికి న్యాయం జరగని పక్షంలో కోర్టు ద్వారా ముందుకు వెళతామన్నారు. పాలిక శ్యాం, 13వ డివిజన్‌ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధిక సంఖ్యలో మహిళలు ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here