స్పందనకు ఫిర్యాదుల వెల్లువ

0
97
రాజమహేంద్రవరం, జనవరి 27 : అర్హత కలిగిన వారందరికి ప్రభుత్వ పథకాలు చేరువచేస్తామని రాజమహేంద్రవరం సబ్‌ కలెక్టర్‌ డాక్టర్‌ ఆర్‌.మహేష్‌ కుమార్‌ అన్నారు.  స్థానిక సబ్‌-కలెక్టర్‌ కార్యాలయంలో ”స్పందన”కార్యక్రమం నిర్వహించి ప్రజలనుండి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వికలాంగుల పించను, వితంతు పించను పొందాలంటే సంబంధిత దృవీకరణ పత్రాలు దరఖాస్తుతో జత చేయవలసి ఉంటుందన్నారు. ఆధార్‌ కార్డులో ఏదైనా తప్పులు ఉన్న యెడల సరిచేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్‌ ఈఈ.జి.సోములు, విద్యుత్‌ శాఖ ఈఈ తిలక్‌, ఏపిడి కెఎన్‌వి ప్రసాద్‌ రావు, వ్యవసాయ శాఖ ఏడి శాంతి వల్లిం, ఆర్‌టిసి డిఎమ్‌ టి.పెద్దిరాజు, ఏఎస్‌ఓ  భీమాశంకర్‌, డివిజనల్‌ పంచాయతీ అధికారి టి.సత్యనారాయణ, మత్య శాఖ అధికారి రామకృష్ణ, శిశు సంక్షేమ శాఖ అధికారి నరసమ్మ, విద్యుత్‌ శాఖ ఏఈ శిరీష్‌, తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here