స్మార్ట్‌ సిటీ పనులను వేగవంతం చేయాలి

0
54
సమన్వయ కమిటీ సమావేశం కలెక్టర్‌
 కాకినాడ, జూలై 9 : కాకినాడ స్మార్ట్‌ సిటీ పనులను వేగవంతం చేయడంతోపాటు, ఆకర్షణీయంగా నగరాన్ని తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్‌ డి.మురళీధర్‌ రెడ్డి ఆదేశించారు. కలెక్టరేట్‌ కార్యాలయంలో కాకినాడ స్మార్ట్‌ సిటీ సమన్వయ కమిటీ సమావేశం ఈరోజు జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్‌ మురళీధర్‌ రెడ్డి మాట్లాడుతూ కాకినాడ స్మార్ట్‌ సిటీలో రోడ్ల విస్తరణలో భాగంగా ఎలక్ట్రికల్‌ పోల్స్‌ తరలింపును వెంటనే చేపట్టాలని, నగరంలో గుర్తించిన 27 ప్రాంతాల్లో వచ్చే రెండు రోజుల్లో నగరపాలక సంస్థ ఇంజనీర్లు, కాంట్రాక్టర్లు, ఎ.పి.ఇ.పి.డి.సి.ఎల్‌. అధికారులు సంయుక్తంగా పరిశీలన చేసి, నెల రోజుల్లో వీటిని తరలించాలని కలెక్టరు ఆదేశించారు. నగరంలో రోడ్ల పై ఉన్న గుంతలు లేకుండా అవసరమైన మరమ్మత్తు పనులు చేపట్టాలని, రోడ్ల మరమ్మత్తులు చేపట్టిన వెంటనే సంబంధిత చెత్తను తొలగించాలని కూడా కలెక్టరు సూచించారు. ఎస్‌.ఎన్‌.ఎల్‌. మరియు భాగ్యనగర్‌ గ్యాస్‌ పనులు చేపట్టిన చోట తక్షణ మరమ్మత్తు పనులు చేపట్టాలని కలెక్టరు సూచించారు. ఎ.పి.ఫైబర్‌ నెట్‌ ఆధ్వర్యంలో ప్రధాన కూడళ్ళలో ఏర్పాటు చేసిన కెమెరాలను ట్రాఫిక్‌ పోలీస్‌తో అనుసంధానం చేసి వీటిని వినియోగంలోనికి తేవాలన్నారు. ఆకర్షనీయ నగరంగా కాకినాడను రూపొందిస్తున్నందున ఓవర్‌ హెడ్‌ వైరింగ్‌ లను అనుమతించరని ఆయా సంస్థలు అవసరాన్ని బట్టి అండర్‌ గ్రౌండ్‌ కేబుళ్ళను వినియోగించుకోవాలని కలెక్టరు సూచించారు. నగరంలో నెలకొనియున్న జిల్లా క్రీడా ప్రాంగణంలో స్విమ్మింగ్‌ పూల్‌, స్క్వాష్‌ కోర్టు వినియోగంలోనికి తీసుకురావాలని, స్టేడియంలో లైటింగ్‌ మెరుగుపర్చాలని కలెక్టరు సూచించారు. నగరంలో ప్రతిపాదించిన 10 ఎలక్ట్రిక్‌ బస్సులను నడపాలని ఎపిఎస్‌ఆర్‌ టీసి సమన్వయం చేయాలని కలెక్టర్‌ సూచించారు. ఈ సమావేశంలో మున్సిపల్‌ కమిషనర్‌ కె.రమేష్‌, ఆర్‌ అండ్‌ బి ఎస్‌.ఇ. మరియు మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎస్‌.ఇ., విజయ్‌ కుమార్‌, ఆర్‌.టి.సి ఆర్‌.ఎం. కెఎస్‌ బ్రహ్మానందరెడ్డి, బిఎస్‌.ఎన్‌.ఎల్‌. డిఇ వివిఎస్‌ రంగనాథ్‌, సెట్రాజ్‌ సిఇఓ ఎస్‌.మల్లిబాబు, ఎ.పి.ఇ.పి.డి.సి.ఎల్‌., డిఇ ఉదయ భాస్కర్‌ తదతరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here