స్వర్ణాంధ్రలో అనుశ్రీ సత్యనారాయణ జన్మదిన వేడుకలు

0
347

రాజమహేంద్రవరం, జనవరి 10 : అనుశ్రీ ఫిలింస్‌ అధినేత ఏ. సత్యనారాయణ జన్మదిన వేడుకలు స్ధానిక లాలాచెరువు వద్దగల స్వర్ణాంధ్ర వృద్ధాశ్రమంలో నిర్వహించారు. రాజానగరం జనసేన యూత్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో అనుశ్రీ సత్యనారాయణ పాల్గొని వృద్ధుల మధ్య కేక్‌ను కట్‌చేసారు. అనంతరం వృధ్ధాశ్రమం వృద్ధులకు ఏర్పాటుచేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనుశ్రీ సత్యనారాయణకు స్వర్ణాంధ్ర నిర్వాహకులు డాక్టర్‌ గుబ్బల రాంబాబు కండువా వేసి స్వాగతం పలికారు. అలాగే నందమూరి బాలకృష్ణ అభిమాన సంఘం నాయకుడు గొర్రెల రమణ ఆధ్వర్యంలో అనుశ్రీ సినిమాస్‌ (సాయికృష్ణ) వద్ద ఏ .సత్యనారాయణ పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు. నందమూరి బాలకృష్ణ అభిమానసంఘం సభ్యులు ఈ వేడుకలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా వృద్ద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాసరెడ్డి, వాడబోయిన పాండురంగారావు, కె.బాబి, నాగరాజు, నవీన్‌చౌదరి, షణ్ముఖ్‌, వంశీ పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here