రాజమహేంద్రవరం, డిసెంబర్ 2 : జేసిఐ రాజమండ్రి పూర్వ అధ్యక్షుడు దొంతంశెట్టి సుధాకర్ పుట్టినరోజు సందర్భంగా సోమవారం పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. స్ధానిక లాలాచెరువు స్వర్ణాంధ్ర వృద్ధాశ్రమంలోని వృద్ధులకు అల్ఫాహారం అందించి, వస్త్రాలను పంపిణీ చేసారు. అలాగే వృద్ధాశ్రమంకు స్టీల్ వాటర్ డ్రమ్‌ను బహుకరించారు. ఈ సందర్భంగా సుధాకర్ మాట్లాడుతూ అవసరత ఉన్నవారికి సహాయం అందించడం సంత ప్తినిస్తుందన్నారు. స్వర్ణాంధ్ర వృ ద్ధాశ్రమం నిర్వాహకులు డాక్టర్ గుబ్బల రాంబాబు మాట్లాడుతూ స్వర్ణాంధ్ర ద్వారా నిర్వహిస్తున్న వాల్ ఆఫ్ హ్యాపీనెస్లో సుధాకర్ భాగస్వామ్యం అయ్యారని, అలాగే నగరంలో జరిగే పలు సామాజిక సేవా కార్యక్రమాలలో సుధాకర్ అందిస్తున్న సేవలు అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా స్వర్ణాంధ్ర తరపున సుధాకర్‌కు దుశ్శాలువా కప్పి, జాపికను అందజేసి సత్కరించారు. ఈ కార్యక్రమంలో జేసిఐ ప్రెసిడెంట్ పి.బదరి, సెక్రటరీ జి.సింహాచలం, పూర్వాధ్యక్షులు కె.గంగాధర్, పవన్జాజూ, వరదా రవి, పి గంగాధర్, అలయన్స్ క్లబ్ మాధవి గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.