స్వర్ణాంధ్ర రాంబాబుకు ఆత్మీయ సత్కారం

0
309
రాజమహేంద్రవరం,  నవంబర్‌ 9 : స్వర్ణాంధ్ర వృద్ధాశ్రమం ద్వారా వృద్ధులు, అనాధలకు సేవలందిస్తున్న డా|| గుబ్బల రాంబాబు సేవలు అందరికీ ఆదర్శనీయమని, రావులపాలెం కార్తీక వనసమారాధన మ¬త్సవ కమిటీ అధ్యక్షులు పోతంశెట్టి గంగిరెడ్డి అన్నారు. మంగళవారం స్థానిక టింబర్‌ యార్డ్‌లో జరిగిన 30వ కార్తీక వనసమారాధన కార్యక్రమంలో పలువురు సామాజిక సేవకుల్ని కమిటీ తరుపున సత్కరించారు. రాజమండ్రికి చెందిన స్వర్ణాంధ్ర సేవాసంస్థ ప్రధాన కార్యదర్శి రాంబాబు సేవలు తాను స్వయంగా చూశానని, వృద్ధులకు వృద్ధాశ్రమం నిర్వహించడం ఒక గొప్ప కార్యక్రమమన్నారు. ఈ సందర్భంగా డా|| రాంబాబును దుశ్శాలువాతో సత్కరించి, జ్ఞాపికను బహూకరించారు. కులమత విబేధాలు లేకుండా కార్తీక సమారాధన  గత 30 సంవత్సరాలుగా అందరినీ ఒక చోట చేర్చి వన సమారాధన చేస్తున్న కనికిరెడ్డిను రాంబాబు అభినందించారు.  పడాల రామకృష్ణారెడ్డి, కుడిపూడి నాగభూషణం, మన్యం వర్ధనరావు, జాదూగర్‌ శ్యామ్‌, డిబి రాజు తదితరులు పాల్గొన్నారు.