స్వశక్తితో ఎదిగిన కళాకారుడు జిత్‌మోహన్‌ మిత్ర 

0
528
రాజమహేంద్రవరం కళలకు కాణాచి. విభిన్న రంగాలకు చెందిన ఎందరో కళాకారులు ఈ గడ్డపై నుంచి ఎంతో ఎత్తుకు ఎదిగారు. అలాగే కొన్ని కుటుంబాలు కళలకే అంకితమయ్యాయి. వాటిలో శ్రీపాద జిత్‌ మోహన్‌ మిత్ర కుటుంబం ఒకటి. ఆంధ్రా కిషోర్‌కుమార్‌గా పేరొందిన జిత్‌ మోహన్‌ మిత్ర నటునిగా, గాయకునిగా గోదావరి జిల్లాల వాసులకే గాక యావత్‌ సినీ లోకానికి పరిచయం. జిత్‌ విద్యార్ధి దశ నుంచే మంచి గాయకుడిగా రాణించిన మన జిత్‌ హిందీ పాటల ఆలాపనలో దక్షిణాదివారినే గాక ఉత్తరాది ప్రముఖులనున ఆకట్టుకుంటున్నారు. నటునిగా, గాయకునిగా, క్రీడాకారునిగా, న్యాయవాదిగా, రాజకీయవాదిగా, సంఘ సేవకునిగా, మానవతా వాదిగా జీవితాన్ని సమాజానికి అంకితం చేశారు. జిత్‌ సోదరులు పట్టాభి. బాపు, రమణలు, పట్టాభి  ఏరా అంటే ఏరా అని సంబోధించుకునేవారట. గోదావరి అందాలను తెరకెక్కించడంలో వీరి కుటుంబం పాత్ర ముఖ్యంగా జిత్‌ పాత్ర విశిష్టమైంది. సినీ దర్శకులకు, నిర్మాతలకు జిత్‌ ఆపద్భాందవుడు. ఆయన భరోసాతోనే ఈ ప్రాంతంలో  ఎన్నో సినిమాలు షూటింగ్‌ చేసుకున్నాయి. గాయకుడిగా 65 సంవత్సరాలపాటు అలరించారు. జిత్‌ తన ఆరె ్కష్ట్రాతో  47 సంవత్సరాలో ్ల  దేశం నలుమూలల ఆరువేల ప్రోగ్రామ్స్‌ ఇచ్చారు. జిత్‌ ఇంతవరకు 1995లో సిల్వర్‌ జుబ్లీ, 1999లో నవరస నట సమాఖ్య స్ధాపించడం, 2000 సంవత్సరంలో చలనచిత్ర సంగీత సప్తాహం, 2001లో శ్రుతిలయ సమాఖ్య స్ధాపించడం, 2004, 2005 సంవత్సరంలో గాయకుడిగా 50 సంవత్సరాలు పూర్తయినందుకు నవాంబరాలు, డిసెంబరాలు, కనకాంబరాలు కార్యక్రమాన్ని నిర్వహించారు. జిత్‌ అనేక మందిని సత్కరించారు. వారిలో గానకోకిలలు లీల, జిక్కీ, దర్శకుడు కె.విశ్వనాధ్‌, సంగీత దర్శకుడు జె.వి .రాఘవులు, మిమిక్రీ ఆర్టిస్టు పద్మశ్రీ నేరెళ్ళ వేణుమాధవ్‌, అక్కినేని నాగేశ్వరరావు తదితరులను సత్కరించారు. కళా రంగానికి, సినీ  రంగానికి ఎంతో సేవ చేసిన జిత్‌కు ప్రభుత్వ పరంగా మాత్రం ఎటువంటి అవార్డు ప్రకటించడం కళా ప్రియుల్ని నిరాశపరుసో ్తంది.  ఏ మాత్రం హిందీ తెలియకుండానే 1954లో మొదటి సారి ఆయన హిందీ పాటలు పాడారు. గాయకునిగా, నటునిగా ఆరు దశాబ్ధాలకు పైగా లక్షలాది మంది శ్రోతల్ని, ప్రేక్షకులను అలరించిన, అలరిస్తున్న అద్వితీయ కళాకారుడు జిత్‌. వయస్సు ఏడు పదులు దాటినా మనస్సు మాత్రం ఏనాడు రెండు పదుల గీతను దాటనివ్వని నిత్య యవ్వనుడు. ఆయనకు ఇదెలా సాధ్యమైందంటే  కల్మషం లేకుండా ఉండటమే. యాంత్రిక జీవన విధానంలో మనం మరచిపోతున్న  అనేకమంది మహనీయులను  మనకు గుర్తు చేస్తున్న ధన్య జీవి జిత్‌. తన ఆర్కెష్ట్రా ద్వారానే నూతనప్రసాద్‌, ఆలీని చిత్ర రంగానికి పరిచయం చేశారు. ఇప్పటికే  ఆలీ అనేక సభలో ్ల  మా గురువు జిత్‌ మోహన్‌ మిత్రాయేనని చెప్పడం అందుకు నిదర్శనం. సినీ రంగంలో తనకున్న పరిచయాలతో ఎందరినో ఎందరినో కళా రంగానికి పరిచయం చేయగా వారు ఉన్నత స్ధానాల్లో ఉన్నారు. అయితే తాను మాత్రం  అలాగే ఉండిపోయిన నిస్వార్ధ జీవి. రాజమహేంద్రవరం సాంస్కృతిక ప్రతినిధి జిత్‌ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.  జిత్‌కు నవరస నట సమాఖ్య జీవిత సాఫల్య పురస్కారాన్ని ఈరోజు సాయంత్రం నగరంలోని శ్రీ వెంకటేశ్వరా ఆనం కళా కేంద్రంలో అందజేయడం ఆనందదాయకం.
అడబాల మరిడయ్య కాపు
దొడ్డిగుంట. సెల్‌ : 72071 72094