హక్కుంపేటలో ఘనంగా దేవీ నవరాత్ర మహొత్సవాలు

0
409
రాజమహేంద్రవరం, అక్టోబర్‌ 5 : హక్కుంపేట గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానంలో దేవీ నవరాత్ర మహొత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. విఘ్నేశ్వర పూజ, భూత బలి, పుణ్యాహవాచనం, పంచగవ్యం, అస్త్ర రాజార్చన, లలితా పారాయణ, కుంకుమ పూజలు, చండీ పారాయణ, చండీ హొమాలు ప్రతి రోజూ నిర్వహిస్తున్నారు. ఈ నెల 11న మహా పూర్ణాహుతి శిఖరాభిషేకం జరుగుతుందని ఆలయ అర్చకులు కాళ్ళకూరి సాంబమూర్తి తెలిపారు.