హజ్‌ యాత్రకు 10 లోగా దరఖాస్తులు

0
87
గోదావరి హజ్‌ సొసైటీ ప్రతినిధుల వెల్లడి
రాజమహేంద్రవరం,నవంబర్‌ 8 : ఇస్లామీ విధుల ఆదేశాల్లో ముఖ్యంగా ఉన్న హజ్‌యాత్రకు ఔత్సాహికులు ఈనెల 10వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని గోదావరి హజ్‌ సొసైటీ ప్రతినిధులు కోరారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఈరోజు జరిగిన విలేకరుల సమావేశంలో సొసైటీ అధ్యక్షుడు జనాబ్‌ హాజీ మహ్మద్‌ హబీబుల్లా బేగ్‌ మాట్లాడుతూ ముస్లింలు హజ్‌యాత్ర చేసి అల్లాహ్‌ కారుణ్యానికి పాత్రులు కావాలని ఆకాంక్షించారు.హజ్‌ కమిటీ ఆఫ్‌ ఇండియా ద్వారా 2020లో హాజ్‌యాత్రలో పాల్గొనే తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల ముస్లిం ఔత్సాహికులు ఈనెల 10లోపు ఆన్‌లైన్‌ ద్వారా ఉభయ గోదావరి జిల్లా గోదావరి హజ్‌ సొసైటీ ఆఫీస్‌లో సంప్రదించాలన్నారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి రూ. 3 లక్షల లోపు వార్షిక ఆదాయం ఉన్న వారికి రూ 60 వేలు, 3 లక్షలు పైబడి ఆదాయం ఉన్నవారికి రూ 30 వేలు సబ్సిడీ ప్రకటించారన్నారు. సిఎంకు గోదావరి హజ్‌ సొసైటీ తరపున కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ఈ సబ్సిడీని అందరూ వినియోగించుకోవాలని కోరారు. విజయవాడ విమానాశ్రయం నుంచి నేరుగా హజ్‌యాత్రకు వెళ్లేందుకు ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పిస్తోందని హర్షం వ్యక్తం చేసారు. సమావేశంలో హాజీ ముస్తఫా షరీఫ్‌, జహంగీర్‌, ఎస్‌ఎం అన్సర్‌, నూమాన్‌ ఖురేషీ, ఎండి జమీరుద్దీన్‌, వలీబాబా, ఆసీఫ్‌, షాజహాన్‌, ఖాజామియా తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here