హామీ నిలబెట్టుకోకుంటే ఆగ్రహం ఎదుర్కోవల్సిందే 

0
371
హొదాపై సిపిఐ ప్రజా బ్యాలట్‌
రాజమహేంద్రవరం, సెప్టెంబర్‌ 27 :  ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక  హొదాతోనే ప్రయోజనాలు చేకూరుతాయని, కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు మీసాల సత్యనారాయణ అన్నారు. ఏపీకి ప్రత్యేక హొదాతో ప్రయోజనామా? ప్రత్యేక ప్యాకేజీతో ప్రయోజనామా? అనే అంశంపై కోటగుమ్మం సెంటర్‌లో ప్రజా బ్యాలట్‌ను నిర్వహించారు. సిపిఐ నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రజలు పాల్గొని తమ అభిప్రాయాలను బ్యాలట్‌లో పొందుపర్చారు. ఈ కార్యక్రమంలో మీసాల మాట్లాడుతూ ఇచ్చిన మాటన నిలబెట్టుకోకపోతే ప్రభుత్వాలు ప్రజాగ్రహానికి గురి కాక తప్పదని హెచ్చరించారు. ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినపుడు ఏది ప్రయోజనకరమో? ఏదీ నష్టమో ఎందుకు ఆలోచించలేదని అన్నారు. మాయమాటలు చెప్పి ప్రజలను మోసగించే ప్రయత్నాలు మానుకోవాలని, తక్షణమే హొదా ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నగర కార్యదర్శి నల్లా రామారావు, యడ్ల లక్ష్మీ, సేపేని రమణమ్మ, నల్లా భ్రమరాంబ తదితరులు పాల్గొన్నారు.